చెల్లింపులుగా అమ్మాయిలు

23 Dec, 2016 17:21 IST|Sakshi
చెల్లింపులుగా అమ్మాయిలు
మిర్పూర్ ఖాస్: తీసుకున్న అప్పు కింద దక్షిణ పాకిస్తాన్ లో అమ్మాయిలను చెల్లింపుగా తీసుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా దక్షిణ పాకిస్తాన్ లో వేళ్లూకుపోయిన ఈ వ్యవస్ధ ఇప్పుడు తారాస్ధాయికి చేరింది. అప్పు తీసుకుని చెల్లించలేని కుటుంబాల్లోని ఆడపిల్లలను అప్పు ఇచ్చిన వారు బానిసలుగా చేసుకుంటున్నారు. మరికొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులే అప్పులు తీర్చలేక అమ్మాయిలను బానిసలుగా పంపుతున్నారు. అప్పు కింద యువతులను తీసుకుంటున్న వారిలో కొందరు వచ్చే అమ్మాయిని రెండో భార్యగా చేసుకుంటుండగా, మరికొందరు డబ్బు కోసం వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు.
 
అమ్మాయిలను వివాహం చేసుకోదలచిన వారు వారిని ముస్లిం మతంలోకి మారుస్తున్నారు. పోలీసులు, కోర్టులకు ఈ విషయాన్ని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఓ తండ్రి వాపోయాడు. దక్షిణ పాకిస్తాన్ మొత్తంలో దాదాపు 20లక్షలకు పైగా అమ్మాయిలు బానిసలుగా జీవనం సాగిస్తున్నారని గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్-2016 పేర్కొంది. సౌత్ ఏసియా పార్ట్నర్ షిప్ ఆర్గనైజేషన్ తెలిపిన వివరాల ప్రకారం ఏటా వెయ్యికి పైగా క్రిస్టియన్, హిందూ బాలికలను ఇస్లాం మతంలోకి మార్చుతున్నట్లు పేర్కొంది.
మరిన్ని వార్తలు