ట్రంప్ను విమర్శిస్తూ ఎయిర్లైన్స్ యాడ్

9 Nov, 2016 11:26 IST|Sakshi
ట్రంప్ను విమర్శిస్తూ ఎయిర్లైన్స్ యాడ్
అమెరికా అధ్యక్షపీఠ ఎన్నికల ఫలితాలు డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్కు షాకిస్తూ.. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వైపు దూసుకెళ్తున్నాయి. అంచనాలకు తారుమారుగా ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఊహించని రిజల్ట్స్కు ముందుగానే ప్రిపేర్ అయిన రాయల్ జోర్డానియన్ ఎయిర్లైన్స్ డొనాల్డ్ ట్రంప్ పై ఓ అడ్వర్టైజ్మెంట్ విడుదల చేసింది. ఆ ప్రకటనలో ట్రంప్కు వ్యతిరేకంగా వ్యాఖ్యానించింది.  ''ఒకవేళ అతను గెలిచినా, అమెరికా ప్రయాణానికి మీకు ఎప్పటికీ అనుమతి ఉంటుంది'' అని ఎయిర్లైన్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్తో పాటు, చికాగో, డెట్రాయిట్, న్యూయార్క్లకు విమాన రేట్ల ధరలను కూడా తెలిపింది.
 
గత సాయంత్రం ఈ ఎయిర్లైన్ సంస్థ చేసిన ట్వీట్కు భారీ స్పందన వస్తోంది. 2,560 రీట్వీట్స్, 1,874 లైక్స్ అది సొంతంచేసుకుంది. అయితే మొదటినుంచి డొనాల్డ్ ట్రంప్ తను గెలిస్తే, ముస్లింలను అమెరికాలోకి ప్రవేశించడాన్ని పూర్తిగా నిషేధిస్తామని హెచ్చరిస్తూ వస్తున్నారు. అదేవిధంగా అమెరికాలోకి వచ్చే వలసవాదులపై కూడా తను మండిపడుతున్నారు. వారెవరినీ అమెరికాలోకి అడుగుపెట్టనీయమని వ్యాఖ్యానిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసే వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఎయిర్లైన్స్ సంస్థ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. కాగ, రాయల్ జోర్డానియన్, జోర్డాన్కు చెందిన విమానయాన సంస్థ. అక్కడ ఎక్కువగా ముస్లింలు ఉంటారు.  
 
మరిన్ని వార్తలు