ఆకలి లేదు.. ఏడుపు లేదు.. ప్రాణాలూ!

4 Sep, 2015 18:45 IST|Sakshi

మూడంటే మూడే సంవత్సరాల వయసు.
తల్లి ఒడిలోనో, తండ్రి భుజం పైనో హాయిగా సేద తీరే పసిప్రాయం.
ఆకలేస్తే ఏడవడం, సంతోషమొస్తే ఎగిరి గంతేయడం మాత్రమే తెలిసిన వయస్సు.
 కానీ ఇప్పుడు ఆకలి లేదు, ఏడుపూ లేదు, ఎందుకంటే ప్రాణాలు కూడా లేవు.

ఇప్పుడీ ఫొటోలు ప్రపంచవ్యాప్తంగా సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఘటన టర్కీలోనిది. చనిపోయింది సిరియా చిన్నారి. ఓ వైపు ఉగ్రదాడులు, మరో వైపు సైన్యం ప్రతిదాడులతో ప్రాణాలు చేతబట్టుకుని అనేక మంది టర్కీకి వలస వస్తున్నారు. సముద్ర మార్గంలో దొంగచాటుగా చేస్తున్న ఈ ప్రయాణం వారి ప్రాణాలకు ముప్పు తెస్తోంది. సిరియా నుంచి గ్రీస్కు వెళ్తున్న రెండు పడవలు మునిగిపోగా, 12 మంది చనిపోయారు. అందులోంచి కొట్టుకువచ్చిందే ఈ చిన్నారి మృతదేహం. సిరియన్ల దుస్థితికి అద్దం పట్టే ఈ దృశ్యంలో పిల్లాడి పేరు అయిలన్ కుర్దీ.

- రంజన్, సాక్షి టీవీ

>
మరిన్ని వార్తలు