టైగర్ను అరెస్ట్ చేశారంటూ..

2 Sep, 2015 18:41 IST|Sakshi
టైగర్ను అరెస్ట్ చేశారంటూ..

కరాచీ: పాకిస్థాన్లో తలదాచుకుంటున్న 1993 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి  టైగర్ మెమన్ను కరాచీలో అరెస్ట్ చేసినట్టుగా ఓ వార్త బుధవారం కాసేపు హల్చల్ చేసింది. ముంబై పేలుళ్ల కేసులో  టైగర్ మెమన్ సోదరుడు యాకూబ్ మెమన్ను ఉరి తీసిన నెల రోజుల తర్వాత వెలువడ్డ ఈ వార్తకు భారతీయ మీడియా చాలా ప్రాధాన్యం ఇచ్చింది. మీడియా ప్రతినిధులు వివరాలు తెలుసుకునేందుకు పాక్కు ఫోన్లు చేశారు. అయితే అరెస్టయిన వ్యక్తి టైగర్ మెమన్ కాదని, అతని పేరు చెప్పుకొని బెదిరింపులకు పాల్పడుతున్న మరో వ్యక్తి అంటూ పాకిస్థాన్ సస్పెన్షన్కు తెరదించింది.

విషయమేంటంటే.. కరాచీలో ఫర్గన్ అనే వ్యక్తి తాను టైగర్ మెమన్ అని చెప్పుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. నకిలీ ఫేస్బుక్ ఖాతాల ద్వారా అమ్మాయిలను వేధించేవాడు. ఈ విషయం పోలీసులకు దృష్టికిరావడంతో ఫర్గన్ను అరెస్ట్ చేశారు. దీంతో కరాచీ పోలీసులు అసలైన టైగర్ మెమన్ను అరెస్ట్ చేశారంటూ వార్త బయటకువచ్చింది. భారత్ మీడియా ప్రతినిధులు ఈ వార్తను నిర్ధారించుకునేందుకు ఫోన్లు చేయగా పాక్ అధికారులు అసలు విషయం చెప్పారు. భారత్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో టైగర్ మెమన్ ఉన్న సంగతి తెలిసిందే. 1993లో ముంబై పేలుళ్లలో 257 మరణానికి కారణమైన టైగర్ దేశం విడిచి దుబాయ్ పారిపోయాడు. ఆ తర్వాత పాకిస్థాన్కు వచ్చి తలదాచుకుంటున్నట్టు సమాచారం.
 

మరిన్ని వార్తలు