భద్రతా దళాల గుప్పిట్లో రాష్ట్రపతి భవన్

26 May, 2014 15:22 IST|Sakshi

న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్ భద్రతా దళాల గుప్పిట్లోకి వెళ్లింది. ఇక్కడ భారత నూతన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో అసాధారణ భద్రత ఏర్పాటు చేశారు. రాష్ర్టపతి భవనం చుట్టూపక్కల సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకు వైమానిక సిబ్బందితో పాటు ఆరు వేల మంది పార్లమెంట్ కమాండోలు, పోలీసు షార్ప్ షూటర్లు భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గం.లకు మోడీ ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని అత్యంత కట్టుదిట్టుమైన భద్రత మధ్య ఉండే రాష్ట్రపతి భవన్‌ను మరింత పటిష్ట రక్షణ ఏర్పాట్లతో దుర్భేద్యంగా మారుస్తున్నారు.

 

ఈ కార్యక్రమానికి మూడు వేలమంది అతిథులు హాజరుకానున్నారు. తొలిసారిగా సార్క్ దేశాల అధినేతలు కూడా రేపటి వేడుకల్లో పాల్గొననున్నారు. దీంతో పాటుగా వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఏడువేల సిబ్బందితో భారీ భద్రతా ఏర్పాట్లును పర్యవేక్షించనున్నారు. గణతంత్ర దిన పరేడ్‌కు చేపట్టే భద్రతా ఏర్పాట్లకు సరిసమాన స్థారుులో ఇటు భూమి అటు గగనతలాన్ని పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశారు.

 

మోడీ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి విదేశీ అతిథులతో పాటు దేశంలోని ప్రముఖులంతా హాజరవుతున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు