టిన్ టిన్ అడ్వెంచర్స్ కార్టూన్ కు రికార్డు ధర

19 Nov, 2016 21:34 IST|Sakshi
టిన్ టిన్ అడ్వెంచర్స్ కార్టూన్ కు రికార్డు ధర
పారిస్: టిన్ టిన్ అడ్వెంచర్స్ ఎక్స్ ప్లోరర్స్ ఆఫ్ మూన్ కు చెందిన ఓ కార్టూన్ శనివారం 1118 కోట్ల రూపాయల ధర పలికింది. బెల్జియన్ కార్టూనిస్ట్ హెర్జ్ చైనీస్ ఇంకును ఉపయోగించి ఈ చిత్రాన్ని గీశారు. చిత్రంలో బాయ్ రిపోర్టర్, అతని కుక్క స్నోయి, సెయిలర్ కెప్టెన్ హ్యాడ్ డాక్ లు చంద్రుని మీద స్పేస్ సూట్లు వేసుకుని భూమి వైపు చూస్తు నడుస్తుంటారు. ఓ కార్టూన్ ఇంత ధర పలకడంపై కామిక్ నిపుణుడు ఎరిక్ లిరోయ్ మాట్లాడుతూ ’ఎక్స్ ప్లోరర్స్ ఆన్ ది మూన్’చరిత్రలో నిలిచిపోయే బుక్ అని అన్నారు.
 
కాగా, ప్రపంచవ్యాప్తంగా అడ్వెంచర్స్ ఆఫ్ టిన్ టిన్ బుక్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీవ్ స్పిల్ బర్గ్ అడ్వెంచర్స్ ఆఫ్ టిన్ టిన్ పేరుతో కార్టూన్ చిత్రాలను కూడా నిర్మించారు.
మరిన్ని వార్తలు