రూ.9 కోట్లు పలికిన 'టైటానిక్' వయోలిన్

20 Oct, 2013 13:01 IST|Sakshi
రూ.9 కోట్లు పలికిన 'టైటానిక్' వయోలిన్

1912లో మంచు దిబ్బను ఢీకొని మునిగిన టైటానిక్ నౌక నుంచి వెలికితీసిన వయోలిన్ ఇది. నౌక సముద్రంలో మునిగేటపుడు భయాందోళనలతో ఉన్న ప్రయాణికులను శాంత పరిచేందుకు బ్యాండ్‌మాస్టర్ వాలస్ హార్ట్‌లీ దీన్ని వాయించాడని ప్రతీతి.

ఇంతటి అరుదైన వయోలిన్ శనివారం సౌత్‌వెస్ట్ ఇంగ్లాండ్‌లోని విల్ట్‌షైర్ కౌంటీలో నిర్వహించిన వేలంపాటలో రికార్డు స్థాయిలో దాదాపు రూ.9 కోట్లకు అమ్ముడుపోయింది.  టైటానిక్‌ నుంచి బయటపడిన వస్తువుల్లో అత్యధిక ధర పలికింది ఈ వయోలినే కావడం విశేషం.

మరిన్ని వార్తలు