బాధితురాలికి న్యాయం చేయాలి: గీతారెడ్డి

6 Mar, 2016 02:46 IST|Sakshi
బాధితురాలికి న్యాయం చేయాలి: గీతారెడ్డి

హైదరాబాద్: వీణవంక మండలం చల్లూరులో సామూహిక అత్యాచారానికి గురైన దళిత యువతికి నష్టపరి హారం పెంచడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం భాదితురాలు తల్లిదండ్రులతో అమీర్‌పేటలోని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలు కమలమ్మను కలసి తమకు న్యాయం చేయాలని అభ్యర్థించింది. కేసును మళ్లీ దర్యాప్తు చేయాలని కోరింది. అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని యువతి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

వీరికి మద్దతుగా కమిషన్ కార్యాలయానికి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... ఎస్సీ కమిషన్ ద్వారా ఇచ్చే 1.5 లక్షల నష్టపరిహారం పెంచాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. నష్టపరిహారాన్ని పెంచేందుకు జాతీయ ఎస్సీ కమిషన్‌కు నివేదిక పంపిస్తున్నామని కమలమ్మ తెలి పారు. నిందితులపై ఏ చర్యలు తీసుకుంటున్నారన్న దానిపై కరీంనగర్ జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడారు. నిందితులు మైనర్లా, మేజర్లా అన్నది తెలియాల్సి ఉందని, విచారణ అనంతరం వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమలమ్మ తెలిపారు.

>
మరిన్ని వార్తలు