-

వాటాల విక్రయ దిశగా ల్యాంకో పవర్

26 May, 2016 23:46 IST|Sakshi
వాటాల విక్రయ దిశగా ల్యాంకో పవర్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విద్యుత్ వ్యాపార విభాగానికి సంబంధించి రుణ భారం తగ్గించుకునే దిశగా వ్యూహాత్మక ఇన్వెస్టరు వేటలో ఉన్న ల్యాంకో గ్రూప్ తాజాగా అయిదు సంస్థలను షార్ట్‌లిస్ట్ చేసినట్లు సమాచారం. విద్యుత్ వ్యాపారంలోకి కొత్త ఇన్వెస్టరు సుమారు రూ. 700-800 కోట్ల ఈక్విటీని సమకూర్చవచ్చని అంచనా. ఐసీఐసీఐ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర రుణదాతలతో డీల్ విషయంలో ల్యాంకో గ్రూప్ త్వరలో భేటీ కావొచ్చని తెలుస్తోంది.

దాదాపు 8,000 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యంతో ఆరు థర్మల్ పవర్ ప్లాంట్లున్న ల్యాంకో విద్యుత్ వ్యాపార విభాగం విలువ దాదాపు రూ. 45,000 కోట్ల మేర ఉంటుంది. ఇప్పటికే విద్యుత్ వ్యాపార విభాగంలో ఇన్వెస్ట్ చేసేందుకు పిరమల్ క్యాపిటల్ కూడా ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం  ల్యాంకో ఇన్‌ఫ్రా ఆర్థిక ఫలితాలను ప్రకటించనుంది. కాగా, గురువారం బీఎస్‌ఈలో ల్యాంకో ఇన్‌ఫ్రా షేరు 2.73% పెరిగి రూ. 4.52 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు