స్మార్ట్‌ఫోన్‌కు పాస్‌వర్డ్!

16 Sep, 2013 00:32 IST|Sakshi

 లండన్: రోజుకో కొత్త సాఫ్ట్‌వేర్ అభివృద్ధిచేస్తున్న నేపథ్యంలో.. భవిష్యత్తులో ఇక స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్ల వంటివాటికి పాస్‌వర్డ్‌లు పెట్టుకోవాల్సిన అవసరమే లేకుండా పోనుంది. అవును.. ఇలినాయీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన చెంగ్ బో నేతృత్వంలోని బృందం ఈ మేరకు సరికొత్త ‘సెలైంట్‌సెన్స్’ అనే సాఫ్ట్‌వేర్‌ను తయారుచేసింది మరి. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకుంటే ఇక స్మార్ట్‌ఫోన్లకుు పాస్‌వర్డే అవసరం లేదట. టచ్‌స్క్రీన్‌పై జస్ట్ అలా తట్టడంగానీ లేదా స్వైప్ (గీకడం) గానీ చేస్తే చాలు.. ఫోన్ తెరిచేందుకు ప్రయత్నిస్తున్నది మీరేనా? కాదా? అన్నది ఇది ఇట్టే గుర్తుపట్టేస్తుంది.
 
 తడుతున్న లేదా గీకుతున్న చేతివే లి సైజు, ఒత్తిడి, వేగం, గీకే విధానం వంటి అనేక వివరాలను ఇది ఫోన్‌లో అమర్చే సెన్సర్ల ద్వారా అతివేగంగా అంచనావేస్తుంది. ఫోన్ తెరిచేందుకు ప్రయత్నిస్తున్నది వేరే వ్యక్తులని అనిపిస్తే వెంటనే లాక్ పడిపోతుంది. సాధారణంగా 3 నుంచి 5 సార్లు తట్టినా లేదా ఒకసారి గీకినా చాలు.. యజమానిని ఇది గుర్తిస్తుంది. అంతేకాదు.. ఫోన్ వినియోగిస్తున్నవారు యజమానేనా? కాదా? అన్నదీ ఇది ఓ కంట కనిపెడుతుందట. ఆటలు ఆడుకునేటప్పుడు తప్ప ఈ-మెయిళ్లు, ఎసెమ్మెస్‌లు చెక్ చేయడం వంటి సందర్భాల్లో ఆటోమేటిక్‌గా అప్రమత్తం అయిపోతుందట.
 

మరిన్ని వార్తలు