టుడే న్యూస్ రౌండప్

26 Jul, 2017 18:15 IST|Sakshi

‘మా జాతికి స్వేచ్ఛ లేదు. నేను తీవ్రవాదిని కాదు, నాపై కేసులు ఉంటే ఇప్పుడే అరెస్ట్‌ చేయాల’ని కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం పట్టుబట్టారు. గాంధీ మార్గంలో శాంతియుతంగా పాదయాత్ర చేస్తానని పోలీసులను చేతులు జోడించి వేడుకున్నారు.  చలో అమరావతి పాదయాత్రకు అనుమతి లేదంటూ ముద్రగడను పోలీసులు గృహనిర్భంధం చేశారు. మరోవైపు డ్రగ్స్ రాకెట్ కేసులో నేడు నటి చార్మీని సిట్ అధికారులు విచారించారు. శ్రీలంకతో జరగుతున్న తొలిటెస్టులో తొలిరోజున ఆట నిలిపివేసే సమయానికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 399 పరుగులు చేసింది. మరిన్ని కీలక వార్తల అప్ డేట్స్ మీకోసం...

<<<<<<<<<<<<<<<<<<<<<<రాష్ట్రీయం>>>>>>>>>>>>>>>>>>>>>>>

తప్పు చేస్తున్నారు చంద్రబాబు గారు!: వైఎస్‌ జగన్‌
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను గృహ నిర్బంధం చేయడాన్ని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు.


‘నేను తీవ్రవాదిని కాదు..’
‘మా జాతికి స్వేచ్ఛ లేదు. నేను తీవ్రవాదిని కాదు, నాపై కేసులు ఉంటే ఇప్పుడే అరెస్ట్‌ చేయాల’ని కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం పట్టుబట్టారు.

 

 ‘మామీద ఎందుకంత కక్ష, మేమేం తప్పు చేశాం
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గృహ నిర్బంధంతో పాటు కాపు నేతల అరెస్ట్‌లపై వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

 

 కిర్లంపూడిలో పోలీస్‌ రాజ్యం: రోజా
తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో పోలీస్‌ రాజ్యం నడుస్తోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు.

 

డ్రగ్స్ కేసులో కీలక వ్యక్తి అరెస్టు!
రాష్ట్రాన్ని కుదిపేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్‌ రాకెట్‌ కేసు దర్యాప్తులో మరో ముందడుగు.

 

<<<<<<<<<<<<<<<<<<<<<<జాతీయం>>>>>>>>>>>>>>>>>>>>>>>
 'నితీష్‌ ఇంత ఇబ్బంది జీవితంలో చూడలేదు'
బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ కూటమి రెండుగా చీలే సమయం దగ్గరపడిందా?

ప్రధాని మోదీకి మళ్లీ అసంతృప్తి..గైర్హాజరుపై గుస్సా
తన పార్టీకి చెందిన ఎంపీలపై ప్రధాని నరేంద్రమోదీ మరోసారి అసంతృప్తిని వ్యక్తం చేశారు.

రాళ్ల వర్షం కురిపిస్తే పైసలు.. పాక్‌ నుంచి ఆపరేట్
కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు బలగాలు తీసుకునే చర్యలకు ఎలా భంగం కలుగుతుందో విశ్లేషణ చేస్తున్న ఎన్‌ఐఏ అధికారులకు కీలక సమాచారం తెలిసింది.

<<<<<<<<<<<<<<<<<<<<<<అంతర్జాతీయం>>>>>>>>>>>>>>>>>>>>>>>
నాటకీయంగా డ్రగ్ డీలర్ అరెస్ట్
డ్రగ్స్ సరఫరా చేయడంతో పాటు ఇతరులకు అలవాటు చేయడం నేరమే. అయితే అమెరికాలో ఓ డ్రగ్ డీలర్ మాత్రం ఈ విషయాలను పట్టించుకోలేదు.

భారత్‌తో యుద్ధం.. అమెరికానే కారణం: చైనా
డోకాలామ్‌లో ఉద్రిక్తతల నడుమ భారత్‌కు మద్దతు ఇస్తూ అమెరికన్‌ మీడియా ప్రచురించిన ఆర్టికల్‌పై చైనా విరుచుకుపడింది.

దూసుకొచ్చిన యుద్ధనౌక.. కాల్పులు
పర్షియన్‌ సముద్ర జలాల్లోకి దూసుకొచ్చిన ఇరాన్‌ యుద్ధనౌకపై అమెరికా కాల్పులు జరిపింది.

25 పెళ్లిళ్లు.. 146 మంది పిల్లలు..

కెనడాలో ఓ మాజీ మత పెద్ద చేసిన నిర్వాకమిది. గత 25 ఏళ్లలో ఏడాదికి ఒకటి చొప్పున ఆయన పాతిక పెళ్లిళ్లు చేసుకున్నాడు.


<<<<<<<<<<<<<<<<<<<<<<సినిమా>>>>>>>>>>>>>>>>>>>>>>>
షాక్ ఇస్తున్న కత్రినా పుష్ అప్స్
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బాలీవుడ్ బ్యూటీస్ లో కత్రినాకైఫ్ ముందు వరుసలో ఉంటుంది.

నానితో నందమూరి హీరో..?
హీరోగా సక్సెస్ సాధించేందుకు కష్టపడుతున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ అదే సమయంలో నిర్మాతగానూ వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు.

గోల్ మాల్ సెట్లో అల్లు అర్జున్
దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం త‌న నెక్ట్స్  సినిమా కోసం సిద్ధమయ్యాడు.


<<<<<<<<<<<<<<<<<<<<<<బిజినెస్‌>>>>>>>>>>>>>>>>>>>>>>>
మరోసారి కరెన్సీ బ్యాన్‌?
మరోసారి నోట్ల రద్దును కేంద్రప్రభుత్వం చేపట్టబోతుందా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి.

ఆ కార్లతో ఉద్యోగాలు పోతాయా?
గత ఏప్రిల్‌ నెలలో ‘జనరల్‌ మోటార్స్‌’ను కూడా అధిగమించిన అమెరికా కార్ల కంపెనీ ‘తెల్సా’ డ్రైవర్‌ రహిత కార్ల సాంకేతిక పరిజ్ఞానంలో వేగంగా దూసుకుపోతోంది.

ఎట్టకేలకు ఫ్లిప్‌కార్ట్‌-స్నాప్‌డీల్‌ బిగ్‌ డీల్‌
ఎట్టకేలకు ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌కు స్నాప్‌డీల్‌ ఓకే చెప్పింది.


<<<<<<<<<<<<<<<<<<<<<<క్రీడలు>>>>>>>>>>>>>>>>>>>>>>>
శ్రీలంక క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ
భారత్ తో టెస్టు సిరీస్ లో తొలిరోజే శ్రీలంక క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది.

ధావన్ మెరుపు ఇన్నింగ్స్.. డబుల్ సెంచరీ మిస్
రీలంకతో గాలేలో జరగుతున్న తొలిటెస్టులో భారత డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ (168 బంతుల్లో 190; 31 ఫోర్లు) తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు.

పుజారా సెంచరీ.. భారీ స్కోరు దిశగా భారత్
శ్రీలంకతో గాలేలో జరగుతున్న తొలిటెస్టులో భారత క్రికెటర్ చతేశ్వర్ పుజారా శతకం సాధించాడు.

మరిన్ని వార్తలు