టుడే న్యూస్‌ రౌండప్‌

10 Aug, 2017 20:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తన మూడేళ్ల పాలనలో ఓ ఒక్క హామీని నెరవేర్చని సీఎం చంద్రబాబునాయుడు మళ్లీ టేప్‌రికార్డర్‌ ఆన్‌ చేశారని, పాత హామీలను ఇస్తూ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. వార్తల్లో మరో వైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.  ఇక తెలంగాణ విషయానికి వస్తే  తెలంగాణ వ‌చ్చింది కాబ‌ట్టే పోచంపాడు ప్రాజెక్టు వ‌చ్చిందని నీటి పారుద‌ల‌ శాఖ‌మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. నేటి వార్తల్లో ప్రధాన వార్తలు మరోసారి మీకోసం..

<<<<<<<<<<<<<<<<<<<<<<రాష్ట్రీయం>>>>>>>>>>>>>>>>>>>>>>>

'చంద్రబాబు మళ్లీ టేప్‌ రికార్డర్‌ ఆన్‌ చేశారు'
తన మూడేళ్ల పాలనలో ఓ ఒక్క హామీని నెరవేర్చని సీఎం చంద్రబాబునాయుడు మళ్లీ టేప్‌రికార్డర్‌ ఆన్‌ చేశారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు

'తెలంగాణ రావడంవల్లే పోచంపాడు'
తెలంగాణ వ‌చ్చింది కాబ‌ట్టే పోచంపాడు ప్రాజెక్టు వ‌చ్చిందని నీటి పారుద‌ల‌ శాఖ‌మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

సీఎం​ చంద్రబాబుకు అస్వస్థత
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.

మామూళ్ల వివరాలివ్వండి: ఎమ్మెల్యే
వక్ఫ్‌బోర్డుకు కాబోయే చైర్మన్‌ను నేనే.. ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యేకు ఎంత మామూళ్లు ఇచ్చారు..

నేరెళ్ల బాధితులకు అండగా ఉంటాం
నేరెళ్ల బాధితులకు న్యాయం జరిగేదాకా కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ సీనియర్‌ నేత,రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు.

<<<<<<<<<<<<<<<<<<<<<<జాతీయం>>>>>>>>>>>>>>>>>>>>>>>

కలుస్తున్నారు.. డిప్యూటీ సీఎంగా పన్నీర్‌!
తమిళనాడులో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

అమిత్‌ షాకు పటేల్‌పై అంత కక్ష ఎందుకు?
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెడుతున్న సందర్భంగా ఆ అంశానికి మాత్రమే మీడియా ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉండగా, అలా ఎందుకు జరగలేదు?

చిదంబరం తనయుడికి ఊరట
కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి పీ చిదంబరం తనయుడు కార్తీ చిదంబరానికి ఊరట కలిగింది.

<<<<<<<<<<<<<<<<<<<<<<అంతర్జాతీయం>>>>>>>>>>>>>>>>>>>>>>>

అమెరికా ముందు ఆరు మార్గాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తరకొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ల మధ్య మాటలు తూటాలై పేలుతుండటంతో ప్రపంచమంతటా యుద్ధమేఘాల భయం అలముకుంది.

పాకిస్థాన్‌కు షాకిచ్చిన కొరియా
అంతర్జాతీయ సంస్థలు, విదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు దేశంలోకి రప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది.

యుద్ధానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది: చైనా
భారత్‌తో యుద్ధానికి కౌంట్‌డౌన్‌ మొదలైందని చైనా అధికార పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది.

<<<<<<<<<<<<<<<<<<<<<<సినిమా>>>>>>>>>>>>>>>>>>>>>>>

ఆరు నెలల్లో సాహో షూటింగ్ పూర్తి
బాహుబలి లాంటి భారీ విజయం తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం సాహో.

'లై' రిలీజ్‑కు ముందే ఫుల్ జోష్
నితిన్ హీరోగా లై సినిమాను తెరకెక్కించిన దర్శకుడు హను రాఘవపూడి సినిమా రిలీజ్ కు ముందే ఫుల్ ఖుషీగా ఉన్నాడు.

బోయపాటి మార్క్‑కు భారీ ప్రైజ్..!
మాస్ కమర్షియల్ ఎంటర్‑టైనర్ లతో వరుస విజయాలు సాధిస్తున్న బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న  చిత్రం జయ జానకీ నాయక.

<<<<<<<<<<<<<<<<<<<<<<బిజినెస్‌>>>>>>>>>>>>>>>>>>>>>>>

ఈ స్మార్ట్‌ఫోన్‌ 10లక్షల రిజిస్ట్రేషన్లను దాటేసింది
నోకియా 6 ఇప్పటికే 10లక్షలకుపైగా రిజిస్ట్రేషన్లను సొంతం చేసుకుంది.

భారత్‌లోకి ఎంఐ 5ఎక్స్‌ లేదా ఎంఐ 6
చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమి ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రెండే స్మార్ట్‌ఫోన్లను డ్యూయల్‌ రియర్‌ కెమెరాలతో లాంచ్‌ చేసింది.

అన్న ఎఫెక్ట్‌: ఆర్‌కాం సరికొత్త ఆఫర్‌
రిలయన్స్‌ జియో ఎఫెక్ట్‌తో టెలికాం కంపెనీలన్నీ రోజుకో కొత్త ఆఫర్‌ను ప్రకటిస్తున్నాయి. జియోకు కౌంటర్‌గా కంపెనీలు తమ ప్లాన్లను మార్కెట్‌లోకి ఆవిష్కరిస్తున్నాయి.

యూట్యూబ్‌కు పోటీ వచ్చేసింది!
వీడియో వీక్షణలకు, షేరింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన యూట్యూబ్‌ గట్టి పోటీ వచ్చేసింది.

'ప్రతీసారి కోహ్లికి కోపం అవసరం లేదు'
మైదానంలో తరచు కోపాన్ని ప్రదర్శించడం భారత క్రికెట్ కెప్టెన్ కోహ్లికి అంత మంచిది కాదని శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగా అభిప్రాయపడ్డాడు.

<<<<<<<<<<<<<<<<<<<<<<క్రీడలు>>>>>>>>>>>>>>>>>>>>>>

నాకు సక్లయిన్ కావలె!
ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ ను ఇంగ్లండ్ 3-1 తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.

'నన్ను జట్టు నుంచి తీసేయమన్నా'
ఇటీవల ముగిసిన మహిళల వన్డే వరల్డ్ కప్‑లో భాగంగా ఆరంభపు మ్యాచ్ లో తాను పెద్దగా ఆకట్టుకోలేకపోవడం తీవ్ర ఒత్తిడికి గురైన విషయాన్ని భారత పేసర్ జులన్ గోస్వామి వెల్లడించారు.

'నన్ను జట్టు నుంచి తీసేయమన్నా'
ఇటీవల ముగిసిన మహిళల వన్డే వరల్డ్ కప్‑లో భాగంగా ఆరంభపు మ్యాచ్ లో తాను పెద్దగా ఆకట్టుకోలేకపోవడం తీవ్ర ఒత్తిడికి గురైన విషయాన్ని భారత పేసర్ జులన్ గోస్వామి వెల్లడించారు.

మరిన్ని వార్తలు