టుడే న్యూస్‌ రౌండప్‌

9 Sep, 2017 17:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటింటికీ తెలుగుదేశం పేరుతో డేరాబాబాలు ఇంటింటికీ తిరిగేందుకు సిద్ధమవుతున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేత జోగి రమేశ్‌ ఎద్దేవా చేశారు. ఏం సాధించారని టీడీపీ బాబాలు ఇంటింటికీ వెళుతారని ప్రశ్నించారు. తెలంగాణ వార్తల్లోకి వస్తే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు ఐటీ మినిస్టర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు దక్కింది. వచ్చే ఎన్నికల కోసం టీకాంగ్రెస్‌ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ కోసం​ టీవీ, పత్రిక మొదలు కానున్నాయని టీపీసీసీ చైర్మన్‌ ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు. మరిన్ని వార్తలు మీకోసం..

<<<<<<<<<<<<<<<<<<<< రాష్ట్రీయం >>>>>>>>>>>>>>>>>>>

ఇంటింటికీ టీడీపీ పేరుతో డేరా బాబాలు!
ఇంటింటికీ తెలుగుదేశం పేరుతో డేరాబాబాలు ఇంటింటికీ తిరిగేందుకు సిద్ధమవుతున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేత జోగి రమేశ్‌ ఎద్దేవా చేశారు.

'త్వరలో కాంగ్రెస్‌ పార్టీ పత్రిక, టీవీ'
కాంగ్రెస్‌ పార్టీ కోసం​ టీవీ, పత్రిక మొదలు కానున్నాయని టీపీసీసీ చైర్మన్‌ ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు.

హంద్రీనీవా ప్రాజెక్టులో భారీ అవినీతి..
హంద్రీనీవా ప్రాజెక్టులో భారీగా అవినీతి జరుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు.

బీజేపీ నేతలతో డీఎస్‌ తనయుడి మంతనాలు
టీఆర్ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్‌ రెండో కుమారుడు ధర్మపురి అరవింద్‌ శనివారం బీజేపీ నేతలను కలిశారు.

కేటీఆర్‌కు ఐటీ మినిస్టర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు ఐటీ మినిస్టర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు దక్కింది.

<<<<<<<<<<<<<<<<<<<< జాతీయం >>>>>>>>>>>>>>>>>>>

ఐరాస వేదికగా పాక్‌పై భారత్‌ ఫైర్‌!
దాయాది పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంలో ఒక సాధనంగా వాడుకుంటున్నదని భారత్‌ మండిపడింది.

'ఏడు రోజుల్లో చార్జిషీట్‌.. రంగంలోకి సీబీఎస్‌ఈ'
దారుణ హత్యకు గురైన రెండో తరగతి బాలుడి కేసు విషయంలో కేసు విషయంలో కేంద్ర మాద్యమిక విద్యా విభాగం(సీబీఎస్‌ఈ) రంగంలోకి దిగింది.

గోరఖ్‌పూర్‌ విషాదం: కీలక నిందితుడి అరెస్ట్‌
యూపీలోని గోరఖ్‌పూర్‌ బాబా రాఘవ​దాస్‌ మెడికల్‌ కాలేజ్‌ ఆసుపత్రిలో చిన్నారుల మరణాల ఉదంతం కేసులో నాలుగో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

డేరాలో ఆయుధాల ఫ్యాక్టరీ
అత్యాచారం కేసులో శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ నిర్వహిస్తున్న డేరాలో ఆశ్రమానికి సంబంధించి షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి.

<<<<<<<<<<<<<<<<<<<< అంతర్జాతీయం >>>>>>>>>>>>>>>>>>>

ఇర్మా: మియామికి ముప్పు తప్పినట్లేనా..!
హరికేన్‌ ఇర్మా శనివారం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కరేబియన్‌ దీవులకు 85 మైళ్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

కాజ్‌ కోసం అమ్మకానికి కన్యత్వం
ఉక్రెయిన్‌కు చెందిన 18 ఏళ్ల అందమైన అమ్మాయి యూలియా తన కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టింది.

పర్వతాలకు పేర్లు.. టెన్సింగ్‌ నార్వే, ఎడ్మండ్‌ హిల్లరీ
సౌర కక్ష్యలో సుదూరంగా తిరిగి ప్లూటో గ్రహంలోని పర్వతాలకు ఎడ్మండ్‌ హిల్లరీ, టెన్సింగ్‌ నార్వే పేర్లను ఇంటర్నేషనల్‌ ఆస్ట్రోనామికల్‌ యూనియన్‌ (ఐఏయూ) పెట్టింది.

<<<<<<<<<<<<<<<<<<<< బిజినెస్‌ >>>>>>>>>>>>>>>>>>>

బీసీసీఐ పన్ను ఎంత కట్టిందో తెలుసా?
దేశమంతటిన్నీ ఒకే పన్ను విధానం జీఎస్టీలోకి తీసుకొచ్చిన తర్వాత తొలి నెలల్లో భారీగా పన్ను వసూలయ్యాయి.

ముద్ర యోజనతో 5.5 కోట్ల ఉద్యోగాలు
చిన్న వ్యాపారస్తులకు వరం లాంటి ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం(పీఎంఎంవై) భారీగా ఉద్యోగవకాశాలు సృష్టించిందని తాజా రిపోర్టులో తెలిసింది.

ఆ ఫోన్‌కు 2.5 లక్షలకు పైగా బుకింగ్స్‌
స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం శాంసంగ్‌ తాజా స్మార్ట్‌ఫోన్‌ గెలాక్సీ నోట్‌8కు భారీగా ప్రీ-బుకింగ్స్‌ వెల్లువెత్తుతున్నాయి.

<<<<<<<<<<<<<<<<<<<< సినిమా >>>>>>>>>>>>>>>>>>>

ప్రభాస్ 'సాహో'పై ఇంట్రస్టింగ్ అప్‑డేట్
బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసింది.

వంద జన్మలకైనా ఆయనతోనే పెళ్లి : హీరోయిన్‌
ప్రముఖ బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి (42) తన భర్త రాజ్‌కుంద్రా (41)పై ప్రేమను అమాంతం కుమ్మరించింది. ఎంతలా అంటే వాటి ప్రభావంతో ఆయన తడిసి ముద్దయ్యేలా.

హమ్మయ్య.. స్పైడర్ షూటింగ్ పూర్తయ్యింది..!
సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పైడర్ సినిమా షూటింగ్ పూర్తయ్యింది.

<<<<<<<<<<<<<<<<<<<< క్రీడలు >>>>>>>>>>>>>>>>>>>

ఈ రోజు సచిన్ కు చాలా ప్రత్యేకం
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఘనతలు గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

క్రికెటర్లకు బ్రేక్ ఇవ్వండి: రవిశాస్త్రి
వరుస షెడ్యూల్‑తో బిజీగా ఉన్న భారత క్రికెటర్లకు బ్రేక్ ఇవ్వడం అనివార్యమని చీఫ్ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు.

టాస్ 'అయోమయం'పై క్లారిటీ!
టీమిండియా-శ్రీలంక జట్ల మధ్య బుధవారం జరిగిన ఏకైక ట్వంటీ 20 మ్యాచ్ లో టాస్ విషయంలో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే.

నా హెయిర్ స్టైల్.. నా ఇష్టం: హార్దిక్
భారత క్రికెటర్ల ఫామ్ కంటే కూడా వారి హెయిర్ స్టైల్ నచ్చితేనే జట్టులో చోటు దక్కుతుందంటూ ఇటీవల దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ సెటైర్లు గుప్పించిన సంగతి తెలిసిందే.

 

మరిన్ని వార్తలు