టయోటా కామ్రి హైబ్రిడ్ ఆవిష్కరణ

29 Aug, 2013 01:43 IST|Sakshi
టయోటా కామ్రి హైబ్రిడ్ ఆవిష్కరణ

న్యూఢిల్లీ: టయోటా కంపెనీ కామ్రి హైబ్రిడ్‌ను భారత్‌లో బుధవారం ఆవిష్కరించింది. దేశీయంగా తయారవుతున్న తొలి హైబ్రిడ్ కారు ఇదేనని టయోటా కిర్లోస్కర్ మోటార్  ఎండీ, సీఈవో హిరోషి నకగవ చెప్పారు. ఈ కామ్రి హైబ్రిడ్ ధరను రూ. 29.75 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) గా నిర్ణయించామని తెలిపారు.

బెంగళూరు సమీపంలోని బిదాడి ప్లాంట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అసెంబ్లీ లైన్‌లో ఈ కారును తయారు చేస్తామని వివరించారు. 2.5 పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ ఉన్న ఈ కారు హైబ్రిడ్ సినర్జీ డ్రైవ్ టెక్నాలజీతో పనిచేస్తుందని, 19.16 కి.మీ. మైలేజీ వస్తుందని పేర్కొన్నారు. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల హైబ్రిడ్ కార్లను విక్రయించామని టీకేఎం డిప్యూటీ ఎండీ, సీఈవో(ఎమ్‌అండ్‌సీ) సందీప్ సింగ్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు