టయోటా కొత్త కారు రూ.15.87లక్షలు

16 Mar, 2017 13:36 IST|Sakshi
టయోటా కొత్త కారు రూ.15.87లక్షలు
న్యూఢిల్లీ : ప్రముఖ అంతర్జాతీయ కార్ల తయారీ సంస్థ టయోటా కొత్త కోరోలా అల్టిస్ ఫేస్లిఫ్ట్ ఎట్టకేలకు భారత మార్కెట్లోకి వచ్చేసింది. రూ.15.87 లక్షలు నుంచి రూ.19.91 లక్షల(ఎక్స్ షోరూం, ఢిల్లీ) వరకు ధర శ్రేణిలో ఈ కొత్త కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. టయోటా సెగ్మెంట్లలో ఎక్కువ విజయవంతమైన సెడాన్లలో కోరోలా అల్టిస్ ఒకటి. ప్రస్తుతం ఆఫర్ చేస్తున్న ఫేస్లిఫ్ట్ మోడల్ లో స్టైలింగ్, కొత్త ఫీచర్లను, ఎక్కువ ప్రీమియం లుకింగ్ ను కలిగి ఉంది. కొత్త జనరేషన్ హ్యుందాయ్ ఎలంట్రా, స్కోడా ఆక్టావియాలకు ఈ కారు గట్టి పోటిని ఇవ్వనుంది.  పెట్రోల్, డీజిల్ వెర్షన్ రెండింటిలోనూ ఇది మార్కెట్లోకి వచ్చింది.
 
డీజిల్ వెర్షన్ రేట్లు రూ.17.36 లక్షల నుంచి రూ.19.05 లక్షల మధ్యలో ఉన్నాయి. గ్లోబల్ గా ఈ కారు 150 దేశాల్లో అమ్ముడుపోతుంది. లాంచ్ అయిన ఇప్పటివరకు గ్లోబల్ గా 44 మిలియన్ యూనిట్లకు పైగా విక్రయించినట్టు కంపెనీ పేర్కొంది. కొత్త ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ క్లస్టర్ విత్ డీఆర్ఎల్స్, 16 అంగుళాల అలోయ్ వీల్స్ వంటివి దీనికి పొందుపరిచారు.  7 ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్స్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, వెహికిల్ స్టెబిలిటీ కంట్రోల్, అద్భుతమైన క్యాబిన్ తో ఇది రూపొందింది. 
 
 
Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు