పంచాయతీ సభ్యుల శిక్షణ పెంచాలి : స్థాయీ సంఘం

18 Aug, 2013 22:50 IST|Sakshi

దేశవ్యాప్తంగా ఎన్నికైన పంచాయతీ ప్రతినిధులకు ఇస్తున్న శిక్షణ ఏమాత్రమూ సరిపోవడం లేదని, ముఖ్యంగా శిక్షణనిచ్చేందుకు ప్రస్తుతమున్న మౌలిక సదుపాయాలు ఎంతమాత్రమూ సరిపోవని పంచాయతీ రాజ్ సంస్థలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం పేర్కొంది.

ప్రస్తుతం ఉన్న శిక్షణ కార్యకలాపాలను మరింతగా పెంచేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. పంచాయతీ రాజ్ సంస్థల సామర్థ్యం ఆశించిన విధంగాలేదని అదేసమయంలో ఎన్నికైన 29 లక్షల మంది ప్రతినిధులకు ఆయా రాష్ట్రాల్లో ఇస్తున్న శిక్షణ కూడా సంతృప్తికరంగా లేదని స్థాయీ సంఘం తన నివేదికలో స్పష్టం చేసింది.

ప్రస్తుతం అందిస్తున్న శిక్షణ నెట్‌వర్క్‌ను మరింత విసృ్తతం చేసేందుకుగాను నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసింది. సదరు సిఫార్సులపై స్పందించిన మంత్రిత్వ శాఖ, రాజీవ్ గాంధీ పంచాయత్ సశక్తికరణ్ అభియాన్ ఆయా సమస్యలపై దృష్టి సారిస్తుందని పేర్కొంది.

>
మరిన్ని వార్తలు