ఇక ట్రాన్స్జెండర్లకూ సమానహక్కులు!

24 Apr, 2015 19:34 IST|Sakshi

రాజ్యసభ చరిత్రలోనే ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనట్లుగా.. ఓ సభ్యుడి ప్రైవేటు బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ట్రాన్స్జెండర్లకు (లింగమార్పిడి చేయించుకున్నవారు) ఇతర పౌరులతో సమానహక్కుల కల్పించాలనే ఈ బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇలా ఏకగ్రీవంగా ఆమోదం పొందడం అత్యంత అరుదైన విషయమని డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ వ్యాఖ్యానించారు. ట్రాన్స్జెండర్ వర్గీయుల కోసం కేంద్ర, రాష్ట్రాల స్థాయుల్లో ప్రత్యేక కమిషన్లను ఏర్పాటుచేయాలని కూడా ఈ బిల్లులో పేర్కొన్నారు.

చిట్టచివరి సారిగా ఓ ప్రైవేటు బిల్లు 1970లో ఆమోదం పొందింది. ప్రభుత్వంలో భాగం కాని అంటే.. మంత్రి కాని సభ్యుడు ప్రవేశపెట్టే బిల్లును ప్రైవేటు బిల్లు అంటారు. ఇప్పుడు ట్రాన్స్జెండర్ల హక్కుల బిల్లును డీఎంకే సభ్యుడు తిరుచ్చి శివ ప్రవేశపెట్టారు. అందరికీ మానవహక్కులు ఉన్నాయని, అలాంటప్పుడు కొంతమందిని ఎందుకు నిర్లక్ష్యం చేయాలని ఆయన ప్రశ్నించారు. ఈ బిల్లును రాజ్యసభ మూజువాణీ ఓటుతో ఆమోదించింది.

మరిన్ని వార్తలు