రాత్రంతా అడవిలోనే..

21 Sep, 2017 09:32 IST|Sakshi

మహబూబ్‌నగర్‌:
పండుగల సీజన్‌ వస్తే చాలు ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు గుంజే ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు ప్రయాణికుల రక్షణ గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. బస్సులో సాంకేతిక సమస్య తలెత్తి మార్గమధ్యలో చెడిపోయిన ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా.. తాత్సారం చేసిన మరో ఘటన వెలుగుచూసింది.

బుదవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లె బయలుదేరిన దిప్నా ట్రావెల్స్‌ బస్సు(ఏపీ 04 వై 7865) అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో కొత్తకోట వద్ద చెడిపోయింది. ట్రావెల్స్‌ యాజమాన్యం బస్సులో ఉన్న ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో.. అడవిలోనే రాత్రంతా గడపాల్సి వచ్చింది. దసరా సెలవులు కావడంతో.. బస్సు నిండా విద్యార్థులు, మహిళలు ఉన్నారు. రాత్రంతా రోడ్డుపైనే గడిపినా ట్రావెల్స్‌ యాజమాన్యం కనీసం పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు