కేన్సర్‌కు ‘కత్తెర’

7 Nov, 2015 02:10 IST|Sakshi
కేన్సర్‌కు ‘కత్తెర’

లండన్: మందులకు లొంగని భయంకరమైన కేన్సర్‌ను నయం చేసి పరిశోధకులు చరిత్ర సృష్టించారు. ఏడాది  పాపకు సోకిన లుకేమియా(బ్లడ్‌కేన్సర్)ను పూర్తిగా నయం చేశారు. ‘పరమాణు కత్తెరలు’ ఉపయోగించి జన్యువుల్లో మార్పు చేసి కేన్సర్ కణాలను చంపేయడం వల్ల ఇది సాధ్యమైంది. ‘జన్యువుల్లో మార్పులు చేసి కేన్సర్ కణాలను చంపే వ్యాధి నిరోధక కణాలను సృష్టించాం.  బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్న లైలా రిచర్డ్స్ అనే చిన్నారిపై ప్రయోగించాం’ అని  లండన్‌కు చెందిన గ్రేట్ ఒర్మాండ్ స్ట్రీట్ ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు.

లైలాకు గతంలో కీమోథెరపీ, ఎముకమజ్జ మార్పిడి చేసినా మిగిలిన కేన్సర్ కణాలను డాక్టర్లు నశింపచేయలేకపోయారన్నారు.  ప్రస్తుత పద్ధతిలో దాతల నుంచి వ్యాధినిరోధక కణాలైన ‘టీ-కణాలను’ సేకరించి వాటి జన్యువుల్లో మార్పులు చేసి కేన్సర్ కణాలను గుర్తించేలా రూపొందిస్తారు. ఈ కణాలను రోగి శరీరంలోకి ప్రవేశపెట్టడం ద్వారా శరీరంలోని కేన్సర్ కణాలను అవి చంపేస్తాయి.

మరిన్ని వార్తలు