'ఇక మొక్కలకు ఐడెంటీ కార్డులు'

16 Sep, 2015 10:47 IST|Sakshi

కోల్కతా: ఇప్పటి వరకు మనుషులకు మాత్రమే ఐడెంట్లీ కార్డులు ఉండగా.. ఇక నుంచి మొక్కలకు కూడా గుర్తింపు కార్డులు రానున్నాయి. వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకుని గ్లోబల్ వార్మింగ్ పరిస్థితి దాపురించిన నేపథ్యంలో కోల్కతాలోని కోన్నాగర్ మున్సిపాలిటీ సంస్థ మొక్కల ప్రాధాన్యాన్ని చాటి చెప్పేందుకు వాటికి ప్రత్యేక గుర్తింపు కార్డులు కేటాయించింది.

28 రకాల మొక్కలకు ఇప్పటికే మూడువేల ఐడెంటీ కార్డులను జారీ చేసింది. ఈ ఐడెంటీ కార్డులో మొక్కలకు ఉండే స్థానిక పేరుతోపాటు శాస్త్రీయ నామం, అది ఉన్న ప్రాంతం, ఓ ఛాయా చిత్రం, దాని ప్రస్తుత బరువు, కాండం విస్తృతి వివరాలు చేర్చారు. ప్రముఖ పర్యావరణ వేత్త అభిజిత్ మిత్రా ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ఐడెంటీ కార్డును ఆ మొక్కలకు అమర్చినట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు