ట్రంప్‌ టవర్‌లో బ్యాగ్‌ కలకలం

29 Dec, 2016 03:05 IST|Sakshi
ట్రంప్‌ టవర్‌లో బ్యాగ్‌ కలకలం

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌కు చెందిన 58 అంతస్తుల భవంతి (ట్రంప్‌ టవర్‌)లో ఒక అనుమానాస్పద బ్యాగ్‌ కలకలం రేపింది. న్యూయార్క్‌ లోని ఈ భారీ భవంతి లాబీలో బుధవారం ఆ బ్యాగ్‌ కనుగొన్నతర్వాత.. హుటాహుటిన భవంతిని ఖాళీ చేయించారు. ఆ బ్యాగ్‌లో ఆటబొమ్మలు మాత్రమే ఉన్నాయని బాంబు నిర్వీర్య సిబ్బంది తేల్చడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. తన కుటుంబంతో కలసి వచ్చిన ఒక బాలుడు ఆ బ్యాగ్‌ వదిలివెళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా తెలిసింది. దీనిపై ట్రంప్‌ స్పందిస్తూ.. అనుమానాస్పద బ్యాగ్‌తో ఏర్పడ్డ కలకలం సర్దుకుంది అని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ట్రంప్‌ ఫ్లోరిడాలో ఉన్నారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు