ట్రంపోనమిక్స్‌ మనకు నష్టమా? లాభమా?

30 Jan, 2017 11:57 IST|Sakshi
ట్రంపోనమిక్స్‌ మనకు నష్టమా? లాభమా?

న్యూఢిల్లీ: అమెరికా 45 అధ్యక్షుడిగా  ట్రంప్‌  చేపట్టనున్న  విధానాలు, వివిధ పరిపాలనా సంస్కరణలు మన  దేశాన్నికూడా  ప్రమాదంలోకి నెట్టనున్నాయా? వివాదాస్పద నిర్ణయంతో ముస్లిందేశాలకు గట్టి షాకిచ్చిన  ట్రంప్‌ మన మార్కెట్లను, ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయనున్నాడా? ఇపుడిదే చర్చ మార్కెట్‌ నిపుణులను ఆలోచనలో పడవేసింది. అయితే  గ్లోబల్‌ మార్కెట్లతో పోలిస్తే భారతీయ మార్కెట్లపై తక్కువ ప్రభావం ఉండనున్నట్టు  మార్కెట్‌  విశ్లేషకులు అంచనా  వేస్తున్నారు.   ముఖ్యంగా  చైనా, హాంగ్ కాంగ్, ఫిలిప్పీన్స్‌, ఇండోనేషియా, మలేసియా లాంటి  దేశాలు తీవ్రంగా ప్రభావితం కానున్నట్టు తెలుస్తోంది.   వీటి ఆర్థిక వ్యవస్థల కంటే  దేశీయంగా  తక్కువగా ఉండనుందని భావిస్తున్నారు.   లోయర్‌ ఫిస్కల్‌ రేటు, కరెంట్ ఖాతా లోటుతో బలంగా ఉన్న భారతీయ ఆర్థిక వ్యవస్థపై  ట్రంప్‌ విధానాలు ఎఫెక్ట్‌ పెద్దగా ఉండదని భావిస్తున్నారు.  

ట్రంప్‌ ఎఫెక్ట్‌ దేశీయంగా తటస్థమని  నోమురా ఫైనాన్షియల్  సర్వీసెస్ విశ్లేషకుని అంచనా.  బలమైన ఆర్థిక వ్యవస్త, తక్కువ  అంతర్జాతీయ వ్యాపారం కారణంగా ఇతర  మార్కెట్లతో  పోలిస్తే  సాంకేతికంగా బలంగా ఉన్నట్టు చెప్పారు.  టీపీపీలో ఒప్పందంలో ఇండియా భాగస్వామ్యం లేనందున  అమెరికా చేపట్టిన వ్యాపార రక్షణాత్మక చర్యల ప్రభావం చాలా పరోక్షంగా ఉండనున్నట్టు చెప్పారు.  అయితే కఠినమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలు భారతీయ సాఫ్ట్‌ వేర్‌ సంస్థలకు కొంత  నష్టమేనని తెలిపింది. అలాగే అమెరికా సరిహద్దు పన్ను పెరుగుదల  ఔషధ తయారీ, టెక్స్ టైల్స్‌, జెమ్స్‌  అండ్‌​ జ్యుయల్లరీ,  ఆటో ఉత్పత్తులను దెబ్బతీసే అవకాశం ఉందన్నారు.

ముఖ్యంగా చైనా, అమెరికా ట్రేడ్‌ వార్‌   చైనా, లకు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టనుందని నోమురా ఎనలిస్ట్‌ అంచనావేశారు.  అలాగే హాంక్‌ కాంగ్‌   జీడీపీ లో 25శాతం  వాటావున్న  ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ప్రాపర్టీ మార్కెట్‌  కి పెద్ద దెబ్బేనని వ్యాఖ్యానించారు.


అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  సంచలనాత్మక నిర్ణయాలు భారత మార్కెట్లపై ఎలాంటి ప్రభావాన్ని పడవేయనున్నాయి? టంపోనమిక్స్‌  ఫలితాలు మన ఆర్థిక వ్యవస్థపై  సానుకూలమా? అనుకూలమా అనేది మార్కెట్‌​ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యగా   ప్రమాణం చేసినప్పటినుంచి తనదైన దూకుడుతో తీసుకుంటున్న వివాదాస్పద పరిపాలన నిర్ణయాలు ప్రపంచాన్ని  పట్టి కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా ఏడు ముస్లిం దేశాలకు షాకిస్తూ తీసుకున్న కొత్త ఇమ్మిగ్రేషన్‌ నిబంధనలు తీవ్ర విమర్శలకు గురవుతోంది.  అమెరికాలో రెండో రోజూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి.  
 

మరిన్ని వార్తలు