తమిళనాడులో అంచనా తప్పింది

19 May, 2016 09:32 IST|Sakshi
తమిళనాడులో అంచనా తప్పింది

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ట్రెండ్లు ఉత్కంఠ రేపాయి. తొలుత డీఎంకే కూటమి ముందంజలో ఉన్నట్లు కనిపించినా, మళ్లీ అమ్మ పుంజుకుంది. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో కడపటి వార్తలు అందేసరికి అన్నా డీఎంకే 141 స్థానాల్లోను, డీఎంకే 86 స్థానాల్లోను ఆధిక్యంలో ఉన్నాయి. జాతీయ మీడియా మొత్తం డీఎంకే అధికారంలోకి రావడం ఖాయమని చెప్పగా, అంచనా తప్పింది. స్థానికంగా ఉన్న తమిళ చానళ్లు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌ ప్రకారం అమ్మకే ఆధిక్యం వస్తోంది.

గోపాలపురంలోని కరుణానిధి ఇంటి వద్ద ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. కరుణ కుమార్తె కనిమొళి, కొడుకు స్టాలిన్, ఇంకా ముఖ్యమైన నేతలంతా అక్కడే ఉండి ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తున్నారు. తుది ఫలితాలు వెలువడే సమయానికి వాళ్లంతా పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు జయ నివాసం పోయస్ గార్డెన్స్ వద్ద సందడి నెలకొంది.

>
మరిన్ని వార్తలు