అగ్రరాజ్యానికి టర్కీ వార్నింగ్‌

23 Mar, 2017 17:05 IST|Sakshi

అంకారా(టర్కీ): టర్కీ జవాన్లపై సిరియా సరిహద్దుల్లో జరిగిన కాల్పులకు ఆ దేశ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. మరోసారి ఇలా జరిగితే ఊరుకోబోమని అగ్రరాజ్యం రష్యాను హెచ్చరించింది. సిరియా, టర్కీ సరిహద్దుల్లోని కుర్దుల ప్రాబల్యంలో ఉన్న ప్రాంతం నుంచి జరిగిన కాల్పుల్లో ఓ టర్కీ జవాను మృతిచెందాడు. దీనిపై టర్కీలోని రష్యా రాయబారిని పిలిపించుకుని హెచ్చరికలు జారీ చేసింది. సిరియాలో ప్రభుత్వం, తీవ్రవాద, ప్రభుత్వ వ్యతిరేక పక్షాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యానే పర్యవేక్షిస్తోందని, ఈ నేపథ్యంలోనే కాల్పులు జరిగాయని టర్కీ ఆరోపించింది. సిరియాలోని కుర్దుల ఆధీనంలోని ప్రాంతాల్లో రష్యా బలగాలు ఉండటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వతంత్రం కోసం పోరాడుతున్న కుర్దులు రష్యా రాజధాని మాస్కోలో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని మూసివేయాలని కోరింది.

మరిన్ని వార్తలు