'600 మొక్కలు నాటు.. అదే నీకు శిక్ష'

11 Jun, 2015 20:24 IST|Sakshi
'600 మొక్కలు నాటు.. అదే నీకు శిక్ష'

ఇస్తాంబుల్: ఆందోళన నిర్వహిస్తున్న మహిళా కార్యకర్తల్లో ఓ కార్యకర్తపై అతి సమీపం నుంచి టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసు అధికారికి టర్కీ కోర్టు సరికొత్త శిక్షను విధించింది. అతడు మొత్తం ఆరు వందల మొక్కలు నాటాలని శిక్షగా విధించింది. 2013లో ఇస్తాంబుల్ నగరంలో చిన్న చిన్న పార్కులను తీసివేసే కార్యక్రమానికి వ్యతిరేకంగా మహిళా కార్యకర్తలంతా ఆందోళన చేపట్టారు.

ఈ ఆందోళన తీవ్ర స్థాయికి చేరడంతో ఆ సందర్భంగా పతీహ్ జెడ్ అనే పోలీసు అధికారి ఓ మహిళపై స్ర్పే టియర్ గ్యాస్ ప్రయోగించాడు. అది కూడా ఉద్దేశపూర్వకంగా చేసినట్లుగా అతి సమీపం నుంచి ప్రయోగించి ఆమెను గాయపరిచాడు. దీంతో అప్పుడు నమోదైన కేసుపై చివరికి గురువారం కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ పోలీసు అధికారి వ్యక్తిత్వం మంచిదని, దానిని దృష్టిలో పెట్టుకుని కఠిన శిక్ష కాకుండా 600 మొక్కలు నాటితే సరిపోతుందని కోర్టు తీర్పులో పేర్కొంది. దీంతో అతడు ఇక మొక్కలు నాటే పనిలో పడ్డాడు.

మరిన్ని వార్తలు