స్మృతి ఇరానీపై ట్విట్టర్ లో సెటైర్లు

6 Jul, 2016 18:11 IST|Sakshi
స్మృతి ఇరానీపై ట్విట్టర్ లో సెటైర్లు

న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నుంచి స్మృతి ఇరానీని తప్పించి, ఆమెకు తక్కువ ప్రాధాన్యత గల జౌళి శాఖను కేటాయించడం పట్ల సోషల్ మీడియా, ముఖ్యంగా ట్విట్టర్‌లో వ్యంగోక్తులు వెల్లివెరిశాయి.‘విద్యా రంగంలో ఒకే ఒక భారీ సంస్కరణ జరిగింది. అదే స్మృతి ఇరానీని ఆ శాఖ నుంచి తప్పించడం’ అని కొందరు వ్యాఖ్యానించారు. ఆమె ఆధ్వర్యంలోనే విద్యా సంస్కరణల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెల్సిందే. ఆ ప్రక్రియ పూర్తి కాకముందే ఆమెను ఆ పదవి నుంచి తప్పించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

‘నా పని విధానం ఎలా ఉందండీ మోదీగారు? అంటూ ఇరానీ ప్రశ్నించారు. అందుకు మోదీ తగిన సమాధానం ఇచ్చారు.....నా పనిని జడ్జ్ చేయండి అని మోదీని అడిగి ఉండాల్సిందికాదు, బాస్ తీర్పు ఇచ్చారు....జౌళి శాఖ ఇవ్వడంతో ఇక ఆమె ఇంట్లోని కబోర్డులన్నీ జౌళీ వస్త్రాలతో నిండిపోతాయి....మోదీజీ మీరు ఓ జీనియస్.....ఆహా ఇదెంత ఉపశమనం.....ఇక స్మృతి ఇరానీ బీజేపీకి మరో కిరణ్ బీడీ అవుతారు....2019 తర్వాత టీవీ సీరియళ్లుకు మంచి సీరియళ్లు ప్రింట్ చేసుకోవచ్చు.....ఇక బాలాజీ టెలీ ఫిల్మ్స్ కోసం స్మృతి ఇరానీ, ఫ్యాషన్ డిజైనర్ షైనా ఎన్‌సీ కలసి పనిచేసుకోవచ్చు....మోదీ రైట్ నౌ, పూర్ ఇరానీ....జౌళి శాఖకు మారక ముందు ఆ తర్వాత (కామెంట్‌తో ఆమె నవ్వుతున్న ఫొటోను, ఏడుస్తున్న ఫొటోను పోస్ట్ చేశారు)....’ ఇలా వ్యంగోక్తులు హల్‌చల్ చేస్తున్నాయి.

దేశ వ్యాప్తంగా విద్యార్థుల ఉద్యమాలు చెలరేగడానికి ఆమె తొందరపాటు నిర్ణయాలు కారణమయ్యాయని బీజీపీ అధిష్టానం గుర్తించడంతోనే ఆమె శాఖపై వేటు పడింది. ముఖ్యంగా ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ, హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థుల్లో అలజడికి ఆమె తీసుకున్న నిర్ణయాలే కారణమన్న విషయం తెల్సిందే.

మరిన్ని వార్తలు