బీహార్లో పారిపోయి.. అమ్మాయిని పెళ్లాడిన అమ్మడు

22 Oct, 2013 12:56 IST|Sakshi

బీహార్లో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఇద్దరు అమ్మాయిలు తమ ఇళ్లనుంచి పారిపోయి.. వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అవును, మీరు చదివింది కరెక్టే. ఇద్దరూ వేర్వేరుగా ఇద్దరు అబ్బాయిలను పెళ్లి చేసుకోవడం కాదు.. ఇద్దరు అమ్మాయిలే పరస్పరం పెళ్లి చేసుకున్నారు. దీంతో అమ్మాయిలిద్దరిలో ఒకరి తండ్రి, రెండో అమ్మాయి కుటుంబంపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు.

అమ్మాయిలిద్దరూ పెళ్లి చేసుకుని దంపతుల్లా కలిసుంటున్నారు. వీరు రోహ్తస్ జిల్లాలోని ససరాంలో గల ఓ హోటల్లో ఉండగా పోలీసులకు చిక్కారు. వారి మొబైల్ ఫోన్ లొకేషన్ ద్వారా పోలీసులు వారి ఆచూకీ కనుక్కోగలిగారు. అమ్మాయిలిద్దరినీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు పోలీసు అధికారి ఎన్కే రజాక్ తెలిపారు. అమ్మాయిలిద్దరూ ఈనెల నాలుగో తేదీన పారిపోయి, ససరాంలోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. వాళ్లిద్దరూ చిన్నతనం నుంచి స్నేహితులు, కలిసి చదువుకున్నారు కూడా.

మరిన్ని వార్తలు