కశ్మీర్‌లో మళ్లీ కాల్పులు ఇద్దరు జవాన్ల మృతి

15 Aug, 2016 20:21 IST|Sakshi

కశ్మీర్ లోయలో మళ్లీ తీవ్రవాదులు సోమవారం కాల్పులకు తెగబడ్డారు. ఈ ఉగ్రడాడుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది మరణించగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాల్పుల ఘటనతో కశ్మీర్ లోయలో ఉద్రిక్తంగా మారింది. శ్రీనగర్ నౌహట్టా డౌన్ టౌన్‌లోని చారిత్మ్రాక జమా మస్జిద్ వద్ద భద్రతా దళాలపై ఉగ్రవాదులు దాడి జరపగా ఇద్దరు భద్రతా సిబ్బంది మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని, ఎదురు కాల్పులు కొనసాగిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా 70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలో కాల్పులు జరగడం ఆందోళనకు దారితీసింది. దీంతో అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు.


మిలిటెంట్లు ఓ భవనంలోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు.అయితే ఈ మిలిటెంట్లను గుర్తించాల్సి ఉంది. రెండు ఏకే తుపాకులు, ఎనిమిది వారపత్రికలను వీరు స్వాధీనం చేసుకున్నారు. సీఆర్పీఎఫ్ 49వ బెటాలియన్‌కు చెందిన ప్రమోద్ కుమార్ జవానుకు మెడ భాగంలో బుల్లెట్ తగలడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. అనంతరం అతన్ని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. అయితే అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతనికి భార్య, ఓ కూతురు(7) ఉన్నారు. అతని అంత్యక్రియలు మంగళవారం అతని స్వగ్రామమైన కంటారాలోని మిహిజంలో జరగనున్నాయి.



 

మరిన్ని వార్తలు