ఎదురుకాల్పుల్లో ఇద్దరు నక్సల్స్ మృతి

24 Sep, 2016 14:50 IST|Sakshi
భద్రాచలం: సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లో శనివారం పోలీసులు బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. జగదల్‌పూర్ జిల్లా బుర్గుం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్తర్ సమీపంలో మావోయిస్టుల సంచారం ఉందన్న సమాచారం మేరకు పోలీసు బలగాలు కూంబింగ్ చేపట్టాయి.
 
ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. దాదాపు గంటపాటు కాల్పుల అనంతరం మావోయిస్టులు తప్పించుకున్నారు. సంఘటన అనంతరం గాలించగా ఆ ప్రాంతంలో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు కనిపించాయి. సంఘటన స్థలంలో ఒక తుపాకి, ఒక రైఫిల్‌తో పాటు పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని బస్తర్ ఎస్పీ రాజేంద్ర నారాయణ్ దాస్ తెలిపారు.
 
మరిన్ని వార్తలు