మలేసియాలో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

10 Jul, 2015 08:35 IST|Sakshi

కౌలాలంపూర్: ఇస్లామిక్ తీవ్రవాద సంస్థతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులను శుక్రవారం మలేసియాలో అరెస్ట్ చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి ఖలీద్ అబు బాకర్ వెల్లడించారు. నగరంలో జూలై 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు వారం రోజుల పాటు సీమాంతర ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిపిన తనిఖీలలో వారిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అరెస్ట్ చేసిన సదరు వ్యక్తులను వేర్వేరు ప్రాంతాలలో అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

వీరి మలేసియాలో విధ్వంసం సృష్టించడానికి  కౌలాలంపూర్తోపాటు పక్కనే ఉన్న సెలంగార్ రాష్ట్రంలో పలుమార్లు సమావేశమైనట్లు ఆధారాలు లభించాయని పేర్కొన్నారు. దేశంలోని పలు పర్యాటక ప్రాంతాలలో విధ్వంసం సృష్టించడానికి యూరప్లోని ఐఎస్ తీవ్రవాదుల నుంచి వారిలో ఒకరికి సంకేతాలు అందాయన్నారు. సిరియాలో ఆ తీవ్రవాద సంస్థలోని సీనియర్ సభ్యులతో వీరు మలేసియాలో దాడి చేసేందుకు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారని ఖలీద్ అబు బాకర్ తెలిపారు. అరెస్ట్ చేసిన వ్యక్తుల్లో ఒకరికి 28 ఏళ్ల, మరోకరికి 31 ఏళ్లు ఉంటాయని చెప్పారు.

మరిన్ని వార్తలు