ఈ షేరు ధర రూ.50 వేలు

28 Sep, 2016 16:43 IST|Sakshi
ఈ షేరు ధర రూ.50 వేలు

ముంబై: దేశీయ టైర్ల ఉత్పత్తి సంస్థ మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ (ఎంఆర్ఎఫ్) షేర్ ధర బుధవారం నాటి మార్కెట్లో రికార్డ్  స్థాయిలో దూసుకుపోయింది.  ముడిచమురు ధరలు క్షీణించడంతో  ఇటీవల కొద్ది రోజులుగా జోరుమీదున్న టైర్ల ధరలు  ఈ రోజు భారీ లాభాల బాటలో సాగాయి.  ముఖ్యంగా  టైర్ల తయారీ దిగ్గజం  ఎంఆర్‌ఎఫ్‌ బీఎస్‌ఈలో 7 శాతం ఎగసి  కంపెనీ చరిత్రలో మొట్టమొదటిసారిగా రూ. 50,000 స్థాయిని తాకింది.   చెన్నైకు చెందిన ఈ కంపెనీ షేరు  సుమారు  3వేలకు పైగా ఎగిసి  మదుపర్లు ను విపరీతంగా ఆకర్షిస్తోంది.  ఇదే బాటలో మిగిలిన టైర్ల షేర్లుకూడా పయనించాయి. ముఖ్యంగా జేకే టైర్ 8 శాతానికి పైగా, అపోలో టైర్స్ ,సియట్ టైర్స్ 5 శాతానికి పైగా లాభపడ్డాయి.
కాగా  కంపెనీల ముడిసరుకు వ్యయాల్లో నేచురల్ రబ్బర్‌ వాటా 40 శాతం కావడమే దీనికి కారణమని విశ్లేషకులు  చెబుతున్నారు.  సహజ రబ్బర్‌ ధరలు నేలచూపులు చూస్తుండటంతో  ఇటీవల టైర్ల తయారీ షేర్లకు డిమాండ్‌  పెరిగిన సంగతి తెలిసిందే.  దీనికితోడు రుతుపవన ప్రభావంతో రబ్బర్‌ ఉత్పత్తి పుంజుకోనుంది. ఈ సానుకూల అంశాలు టైర్‌ పరిశ్రమ  లాభాలకు దోహదపడ్డాయని నిపుణులు పేర్కొన్నారు.

 

మరిన్ని వార్తలు