మహిళను ఉరితీసిన యూఏఈ

13 Jul, 2015 11:22 IST|Sakshi
మహిళను ఉరితీసిన యూఏఈ

రియాద్: ఉగ్రవాద చర్యలకు పాల్పడిందనే కారణంతో గల్ఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) తమ దేశానికి చెందిన ఓ మహిళను ఉరితీసింది. 2014 డిసెంబర్లో అమెరికాకు చెందిన ఓ ఉపాధ్యాయురాలిని హతమార్చిన నేపథ్యంలో ఆమెకు సోమవారం ఉదయం ఉరిశిక్షను అమలు పరిచింది. అలా బాదర్ అబ్దుల్లా అల్ హషిమి(31) అనే మహిళ గత ఏడాది అబుదాబిలోని ఓ షాపింగ్ మాల్ టాయిలెట్లో ఇద్దరి కవలల తల్లి అయిన అమెరికన్ టీచర్ ఇబోల్యా ర్యాన్ను కత్తితో పొడవడమే కాకుండా అక్కడే మరో అమెరికన్ ఈజిప్టు వైద్యుడిపై బాంబుదాడికి పాల్పడింది.

అంతేకాదు ఆమెపై ఇంటర్నెట్ ద్వారా ఉగ్రవాద భావజాలాన్ని తీవ్రస్థాయిలో వ్యాపింపజేసిన ఆరోపణలున్నాయి. ఈ నేరాలకు సంబంధించి ఆమెకు గత ఏడాది యూఏఈ కోర్టు ఉరిశిక్ష విధించగా సోమవారం అమలుచేసింది. అయితే, ఎలా ఉరితీశారనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఉగ్రవాద చర్యలను తీవ్రంగా నిరసించే దేశాల్లో యూఏఈ ఎప్పుడూ ముందే ఉంటుంది.

మరిన్ని వార్తలు