సంక్షేమ పథకాల ఉపసంహరణ తరువాతే యూబీఐ

25 Feb, 2017 17:01 IST|Sakshi
సంక్షేమ పథకాల ఉపసంహరణ తరువాతే యూబీఐ
అహ్మదాబాద్: ఆర్థిక సర్వే ప్రతిపాదించిన  సార్వజనీన ప్రాథమిక ఆదాయ (యూనివర్శల్‌ బేసిక్‌ ఇన్‌కం-యూబీఐ) పథకం  అమలు  ప్రస్తుత  సంక్షేమ పథకాల ఉపసంహరణ  తరువాతే ఉంటుందని  ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం  ప్రకటించారు. ఇప్పటికే అమల్లో  ఉన్న సంక్షేమ ప్రాజెక్టుల  విరమణ అనంతరం మాత్రమే  యూనివర్సల్ బేసిక్‌ ఇన్‌కం  పథక ప్రతిపాదనను అమలు చేసే అవకాశం ఉందని   తెలిపారు. అహ్మదాబాద్ ఐఐఎం-ఏలో  శనివారం విద్యార్థులనుద్దేశించి ప్రసంగించిన  సుబ్రమణ్యం  ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా  ఆర్థిక సర్వే విశేషాలను  విద్యార్థులతో పంచుకున్నారు.   
 
ఈ  యూబీఐ కార్యక్రమం   అమలు చాలా  ఖర్చుతో   కూడుకున్నదనీ, ఇప్పటికే సంక్షేమ పథకాల కార్యక్రమాల  ఖర్చును ప్రభుత్వం భరించలేని స్థితిలో ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యూబీఐ పథకాన్ని జోడించలేమని చెప్పారు.  అలా చేస్తే ప్రభుత్వ ఆర్ధికపరిస్థితి పతనంవైపు వెళ్తుందని సుబ్రమణ్యం తెలిపారు.   ప్రభుత్వ సాంఘిక సంక్షేమ పథకాల ద్వారా ఖర్చు చేస్తున్న నిధులు ..లబ్దిదారులు చేరడం  లేదన్నారు. అయితే భారతదేశంలో పేదల అభ్యున్నతికోసం  నిర్దేశించిన యూబీఐ  పథకం ఈ సమస్యల్ని అధిగమిస్తూ సరికొత్త పద్ధతుల్లో ప్రారంభిచనున్నట్టు చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ పథక ఫలాలు నేరుగా లబ్దిదారులకు చేరేలా చేయడంమే దీని ప్రత్యేకత అని చెప్పారు.  గత (స్వతంత్రం వచ్చిన తర్వాత)30-40 సంవత్సరాల్లో చేయలేని పనికి తాము పూనుకున్నామన్నారు.   పేదరిక నిర్మూలనలో  ఇది భారీ చారిత్రక సవాలు అని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు  పేదల చేతికి (బ్యాంకు ఖాతాల)  డబ్బు అందితే వారు విచ్చలవిడిగా ఖర్చుచేసే అవకాశం ఉందనీ, అదే  డబ్బు  స్త్రీల కిస్తే   దుర్వినియోగయ్యే  అవకాశాలు  చాలా తక్కువగా ఉంటాయని అభిప్రయాపడ్డారు.
 
అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక వృద్ధి రేటు మందగించగా, అభివృద్ధి చెందుతున్న దేశాలలో వృద్దిరేటు వేగంగా  పుంజుకోవడం గమనించాలన్నారు.  అయితే మన దేశంలో  ఇందుకు విరుద్ధంగా ఉందన్నారు.    ఆశ్చర్యకరంగా   గత 15-20 సంవత్సరాలలో వెనుకబడిన రాష్ట్రాలకుగా  పిలుస్తున్న  రాష్ట్రాల్లో అభివృద్ధి వేగం మందగిస్తోంటే.. అభివృద్ది  చెందిన రాష్ట్రాలు   శరవేంగా ముందుకు వెళుతున్నాయని చెప్పారు.   దేశంలో  రాష్ట్రాల మధ్య ఆదాయ అసమానతలను భారీగా పెరుగుదుల ఇది  సూచిక అన్నారు
 
కాగా పేదలు తమ ప్రాథమిక అవసరాలు తీర్చుకునేందుకు అవసరమయ్యే కనీసస్థాయి నగదును ప్రభుత్వం అందించాలని ముఖ్య ఆర్థిక సలహాదారుడు అరవింద్‌ సుబ్రమణియన్‌ రూపొందించిన  ఆర్థిక సర్వే సూచించింది.  ప్రస్తుత రాయితీల వ్యవస్థను పూర్తిగా ఎత్తివేసి, వాటిస్థానంలో యూబీఐ ఉండాలనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే.
 
 
మరిన్ని వార్తలు