దేశంలో నకిలీ యూనివర్సిటీలు ఇవే!

1 Jul, 2015 17:16 IST|Sakshi
దేశంలో నకిలీ యూనివర్సిటీలు ఇవే!

దేశంలో నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయి.. కాస్త జాగ్రత్త పడాలంటూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) హెచ్చరించింది. ఈ జాబితాను కూడా వెల్లడించింది. మొత్తం 21 యూనివర్సిటీలను ఈ జాబితాలో చేర్చారు. వీటిలో అత్యధికంగా 8 ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయి. మరో 6 నకిలీ వర్సిటీలు ఢిల్లీలో ఉన్నాయి. తమిళనాడు, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఒక్కోటి చొప్పున నకిలీ యూనివర్సిటీలున్నాయి. తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ ఇవి ఏవీ లేకపోవడం కొంతలో కొంత ఊరట.

1956 నాటి యూజీసీ చట్టం ప్రకారం కేంద్ర/ రాష్ట్ర/ ప్రొవెన్షియల్ చట్టాల ప్రకారం ఏర్పాటైన విశ్వవిద్యాలయాలు లేదా, చట్టంలోని సెక్షన్ 3 కిందకు వచ్చే డీమ్డ్ వర్సిటీలు మాత్రమే తమను తాము యూనివర్సిటీలని చెప్పుకోడానికి అర్హత కలిగి ఉంటాయి. ఈ పరిధిలోకి రానివన్నీ నకిలీ యూనివర్సిటీలే అవుతాయి. అందువల్ల ఈ 21 యూనివర్సిటీలలో పొరపాటున కూడా చదవొద్దని, ఇవి ఇక మీదట డిగ్రీలు ఇవ్వడానికి వీల్లేదని యూజీసీ ఆ నోటీసులో తెలిపింది.

నకిలీ యూనివర్సిటీల జాబితా ఇదీ..
1. మైథిలి యూనివర్సిటీ, దర్భాంగా, బీహార్
2. వారణాసీయ సంస్కృత్ విశ్వవిద్యాలయ, ఢిల్లీ
3. కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, ఢిల్లీ
4. యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ, ఢిల్లీ
5. వొకేషనల్ యూనివర్సిటీ, ఢిల్లీ
6. ఏడీఆర్- సెంట్రల్ జ్యురిడికల్ యూనివర్సిటీ, ఢిల్లీ
7. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఢిల్లీ
8. బడగ్నవీ సర్కార్ వరల్డ్ ఓపెన్ ఎడ్యుకేషనల్ సొసైటీ, బెల్గాం, కర్ణాటక
9. సెయింట్ జాన్స్ యూనివర్సిటీ, కిషనట్టం, కేరళ
10. కేసర్వానీ విద్యాపీఠ్, జబల్పూర్, మధ్యప్రదేశ్
11. రాజా అరబిక్ యూనివర్సిటీ, నాగపూర్, మహారాష్ట్ర
12. డీడీబీ సంస్కృత యూనివర్సిటీ, పుత్తూరు, తిరుచ్చి, తమిళనాడు
13. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, కోల్కతా, పశ్చిమబెంగాల్
14. మహిళా గ్రామ్ విద్యాపీఠ్, అలహాబాద్, ఉత్తరప్రదేశ్
15. గాంధీ హిందీ విద్యాపీఠ్, అలహాబాద్, ఉత్తరప్రదేశ్
16. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి, కాన్పూర్, ఉత్తరప్రదేశ్
17. నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ, అలీగఢ్, ఉత్తరప్రదేశ్
18. ఉత్తరప్రదేశ్ విశ్వవిద్యాలయ, ఉత్తరప్రదేశ్
19. మహా రాణాప్రతాప్ శిక్షా నికేతన్ విద్యాలయ, ప్రతాప్గఢ్, ఉత్తరప్రదేశ్
20. ఇంద్రప్రస్థ శిక్షా పరిషత్, నోయిడా ఫేజ్ 2, ఉత్తరప్రదేశ్
21. గురుకుల విశ్వవిద్యాలయ, మథుర, ఉత్తరప్రదేశ్

మరిన్ని వార్తలు