వీసా బాండ్లపై బ్రిటన్ కేబినెట్‌లో విభేదాలు

12 Sep, 2013 03:52 IST|Sakshi

 లండన్: వివాదాస్పద వీసా బాండ్ల అమలు విషయంలో బ్రిటన్ మంత్రివర్గంలో విభేదాలు పొడసూపాయి. భారత్ వంటి దేశాల నుంచి వచ్చే సందర్శకులపై 3 వేల పౌండ్ల (సుమారు రూ.3 లక్షలు) వీసా బాండ్ విధించాలని బ్రిటన్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే కన్జర్వేటివ్‌ల నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వ భాగస్వాములు కొందరు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. ఈ పథకం అమలైతే హై రిస్కు దేశాలుగా బ్రిటన్ భావిస్తున్న భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాలకు చెందిన పౌరులు ఆరు నెలల యూకే వీసా కోసం 3 వేల పౌండ్లు డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. వీసా గడువు ముగిసినా బ్రిటన్ విడిచివెళ్లని పక్షంలో డిపాజిట్‌ను కోల్పోవలసి ఉంటుంది.  
 

>
మరిన్ని వార్తలు