'ఏ సెక్షన్ కింద చలానా రాస్తారు?'

29 Dec, 2015 11:26 IST|Sakshi
'ఏ సెక్షన్ కింద చలానా రాస్తారు?'

న్యూఢిల్లీ: కాలుష్యాన్ని నియంత్రించే లక్ష్యంతో ఢిల్లీ ప్రభుత్వం జనవరి 1 నుంచి కార్లకు అమలు చేయనున్న సరి-బేసి సంఖ్యల విధానంపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు మనీష్ తివారి కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. ఢిల్లీ వెలుపల నమోదైన వాహనాలను ఎలా నియంత్రిస్తారని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ప్రశ్నించారు.

ఆల్ ఇండియా రిజిస్ట్రేషన్ తో దేశ రాజధానిలోకి ప్రవేశించే వాహనాలకు సరి-బేసి విధానాన్ని ఎలా అమలు చేస్తారని అడిగారు. నార్త్ ఇండియా, ఢిల్లీ చుట్టుపక్కల నుంచి చాలా మంది వాహనాల్లో హస్తినకు వస్తుంటారని.. వారందరికీ జరిమానా విధిస్తారా అని ప్రశ్నించారు. మోటారు వాహనాల చట్టంలోని ఏ సెక్షన్ కింద ప్రతిరోజూ చలానా రాస్తారని నిలదీశారు. వాహనాలకు సరి-బేసి సంఖ్యల విధానం అమలు చేసేముందు బాగా ఆలోచించాలని ఆయన సూచించారు.

మరిన్ని వార్తలు