23 శాతం తగ్గిన యూనియన్ బ్యాంక్ లాభం

26 May, 2016 23:38 IST|Sakshi
23 శాతం తగ్గిన యూనియన్ బ్యాంక్ లాభం

న్యూఢిల్లీ: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 23 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2014-15) క్యూ4లో రూ.1,761 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.1,357 కోట్లకు తగ్గిందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.

మొత్తం ఆదాయం రూ.36,121 కోట్ల నుంచి రూ.36,250 కోట్లకు స్వల్పంగా పెరిగిందని వివరించింది. స్థూల మొండి బకాయిలు 4.96 శాతం (రూ.13,031 కోట్లు)నుంచి 8.70 శాతానికి(రూ.24,171 కోట్లు) పెరిగాయని, అలాగే నికర మొండి బకాయిలు 2.71 శాతం (రూ.6,919 కోట్ల)నుంచి 5.25 శాతానికి(రూ.14,026 కోట్ల)కు ఎగిశాయని తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ షేర్ బీఎస్‌ఈలో 1.2 శాతం లాభపడి రూ.111 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు