రెండో ఇంటికి రూ.2 లక్షలే

5 Feb, 2017 09:55 IST|Sakshi
రెండో ఇంటికి రూ.2 లక్షలే

‘పన్ను’ మినహాయింపుపై కేంద్రం

న్యూఢిల్లీ: రుణంపై రెండో ఇల్లు కొని, దానికి కడుతున్న వడ్డీ, వస్తున్న అద్దెల మధ్య వ్యత్యాసం (నష్టం)పై పొందుతున్న ఆదాయపు పన్ను మినహాయింపును రూ.2 లక్షలకు పరిమితం చేస్తూ తెచ్చిన నిబంధనను వెనక్కు తీసుకునే ఉద్దేశం తమకు లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

కొందరు రుణంపై రెండో ఇల్లు కొన్నాక దానిని అద్దెకు ఇస్తుంటారు. బ్యాంకులకు కడుతున్న వడ్డీ కన్నా వస్తున్న అద్దె తక్కుగా ఉన్నట్లు చూపించి వాటి వ్యత్యాసాన్ని నష్టంగా పేర్కొంటారు. ఇలా ఎంత మొత్తం నష్టం వచ్చిందో అంత మొత్తానికి ఆదాయపు పన్ను మినహాయింపు లభించేది. ఇక నుంచి నష్టంగా పేర్కొన్న మొత్తంలో గరిష్టంగా రూ.2 లక్షలకు మాత్రమే పన్ను మినహాయింపు ఇస్తారు.

మరిన్ని వార్తలు