ఏపీకి 1.93 లక్షల ఇళ్లు మంజూరు

18 Nov, 2015 18:38 IST|Sakshi

న్యూఢిల్లీ: బలహీన వర్గాలకు గృహనిర్మాణ పథకం కింద ఆంధ్రప్రదేశ్ కే కేంద్ర ప్రభుత్వం 1,93,147 గృహాలు మంజూరు చేసింది. ఈ పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 1.50 లక్షలు కేంద్రం అందిస్తుంది. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే.

తెలంగాణకు 10,290, గుజరాత్ కు 15,580, రాజస్థాన్ కు 6,255 గృహాలను కేంద్రం కేటాయించింది. 2022 నాటికి 2 కోట్ల ఇళ్లు నిర్మించాలని కేంద్ర పట్టణాబివృద్ధి శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
 

మరిన్ని వార్తలు