బాపూజీ పేరుతో హార్టికల్చర్ వర్సిటీ

28 Jul, 2015 18:14 IST|Sakshi
బాపూజీ పేరుతో హార్టికల్చర్ వర్సిటీ

మెదక్: కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో హార్టికల్చర్ యూనివర్సిటీని స్థాపిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మెదక్ జిల్లా ములుగులో 5 ఎకరాల పొలాన్ని కేటాయిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్లో 45 ఎకరాల్లో బాలికలు, బాలుర కోసం వేర్వేరుగా ఎడ్యుకేషనల్ హబ్లను ఏర్పాటు చేస్తూ నిర్ణయాలు తీసుకుంది.

ఈ ఎడ్యుకేషన్ హబ్లు 6వ తరగతి నుంచి డిగ్రీ వరకు బాలురు, బాలికల కోసం ఏర్పాటు చేయనున్నట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. హైదరాబాద్లో మారేడుపల్లిలో నిర్మించనున్న క్రిస్టియన్ భవన్ నమూనాకు సీఎం ఆమోదం తెలిపారు. అదే విధంగా రెండు ఎకరాల్లో నిర్మించనున్న క్రిస్టియన్ భవన్లో అన్ని హంగులూ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ తెలిపారు.


సికింద్రాబాద్ మారేడుపల్లిలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించనున్న క్రిస్టియన్ భవనాల నమూనాలు

సికింద్రాబాద్ మారేడుపల్లిలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించనున్న క్రిస్టియన్ భవనాల నమూనాలు

మరిన్ని వార్తలు