కన్న కూతురును కాపాడబోయి..

2 Sep, 2016 17:52 IST|Sakshi
కన్న కూతురును కాపాడబోయి..

అమ్రోహ(యూపీ): ఆకతాయిల ఆగడాల నుంచి కూతురును కాపాడాలనుకున్న తండ్రి హత్యకు గురయ్యాడు. ఉత్తర్ ప్రదేశ్లోని అమ్రోహ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలు.. కొందరు ఆకతాయిలు ఇంటర్మీడియట్ చదువుకుంటున్న బాధితురాలిని తరచుగా వేధించేవారు. స్థానికంగా నివాసముండే ఆ యువకుల ఆగడాలు శృతిమించడంతో తండ్రికి జరిగిన విషయాన్ని బాధితురాలు తెలిపింది.

వేధింపుల విషయాన్ని బాధితురాలి తండ్రి, యువకుల తల్లిదండ్రుల దృష్టికి తీసుకువచ్చాడు. దీంతో ఆగ్రహించిన యువకులు బుధవారం రాత్రి సమయంలో బాధితురాలి ఇంటికి చేరుకొని ఆమె తండ్రిపై దాడికి దిగారు. తీవ్రగాయాలైన అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన పై విచారణకు ఆదేశించినట్టు ఏఎస్పీ ఉదయ్ శంకర్ తెలిపారు. 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు