స్కూల్‌ లో బార్‌గర్ల్స్‌ తో చిందులు

10 Aug, 2017 11:29 IST|Sakshi
స్కూల్‌ లో బార్‌గర్ల్స్‌ తో చిందులు

వారాణాసి: పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే పాఠశాలలో పాడు పని చేశాడు ఓ గ్రామ పెద్ద. సాక్షాత్తు తరగతి గదిలోనే తప్పతాగి బార్‌ గర్స్‌ తో చిందులేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌ లోని మీర్జాపూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

జమల్‌పూర్‌ లోని టెట్రాహియా కాలా కర్ద్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు సోమవారం రాఖీపండగ సందర్భంగా సెలవు ప్రకటించారు. ఆ మరుసటిరోజు స్కూల్‌కి వచ్చిన టీచర్లు షాక్‌కి గురయ్యారు. ప్రాంగణం అంతా ఖాళీ మందు సీసాలు పడి ఉండటంతో స్థానికులను ఆరాతీయగా, అదంతా గ్రామాధికారి చేసిన నిర్వాకమని తేలింది.

ఘటనపై అసిస్టెంట్‌ టీచర్‌ అశోక్‌కుమార్‌ విద్యాశాఖ అధికారి ప్రవీణ్‌ కుమార్‌ తివారీకి ఫిర్యాదు చేయగా, ఆయన విచారణకు ఆదేశించారు. తన పుట్టినరోజు సందర్భంగా స్కూల్‌ లోనే పార్టీ ఇచ్చాడని, పైగా బార్‌ గర్ల్స్‌ తో చిందులు కూడా వేసినట్లు తేలింది. దీంతో రామ్‌కేష్‌ పై చర్యలు తీసుకోవాలని జిల్లామెజిస్ట్రేట్‌తోపాటు చీఫ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ ను తివారీ కోరారు. తాను పార్టీ ఇచ్చిన మాట వాస్తవమేనని, అయితే అందులో తాను పాల్గొనలేదని రామ్‌కేష్‌ చెబుతున్నారు.

మరిన్ని వార్తలు