సివిల్స్ మెయిన్స్ దరఖాస్తు తేదీల ప్రకటన

5 Aug, 2013 03:21 IST|Sakshi

న్యూఢిల్లీ:  సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు డిసెంబర్ 1న జరిగే మెయిన్స్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం తెలిపింది. ఈనెల 20 నుంచి సెప్టెంబర్ 10 వరకూ అభ్యర్థులు తమ డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్(డీఏఎఫ్)లను ఆన్‌లైన్‌లో సమర్పించాలి. ఇలా సమర్పించిన డీఏఎఫ్‌ను ప్రింట్ తీసుకోవాలని, ఆ నకలుపై అభ్యర్థి సంతకం చేసి, సంబంధిత డాక్యుమెంట్లు, ఫీజును జత చేసి సెప్టెంబర్ 18లోగా కమిషన్‌కు పంపాలని సూచించింది.

 
 అదనంగా 100 ఐఆర్‌ఎస్ పోస్టులు: ఆదాయపన్ను శాఖను మరింత పటిష్టం చేయడానికి చేపట్టిన చర్యల్లో భాగంగా అన్ని కేడర్లలోనూ భారీ సంఖ్యలో కొత్త పోస్టులు భర్తీ చేయనున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అదనంగా 100 ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్) పోస్టులను భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. రాబోయే యూపీఎస్‌సీ నోటిఫికేషన్‌లో వీటిని అదనంగా కలుపుతారు. అలాగే ఆదాయపన్ను శాఖలో దిగువ స్థాయి వివిధ కేడర్లలో 20,751 పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వీటిని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తారు.
 

మరిన్ని వార్తలు