అక్రిడిటేషన్ ప్యానల్ రద్దు: విద్యార్థులకు షాక్!

5 Jan, 2017 10:19 IST|Sakshi

లక్షలాది భారతీయ విద్యార్థులకు అమెరికా ప్రభుత్వం షాకిచ్చింది.   అక్రిడేటింగ్  కౌన్సిల్ ఫర్  కాలేజీస్  అండ్ స్కూల్స్   (ఏసీఐసీఎస్) ప్యానల్ ను రద్దు చేసి భారతీయ విద్యార్థులకు షాకిచ్చింది. అమెరికాలోని ఇండిపెండెంట్ కాలేజీలు, స్కూళ్ళకు సంబంధించిన అక్రిడిటింగ్ కౌన్సిల్ గుర్తింపును యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్యాన్సిల్ చేసింది. ఈ మేరకు అక్కడి స్టూడెంట్ అండ్ ఎక్స్ చేంజ్ విజిటింగ్ ప్రోగ్రాం కు సంబంధించిన సర్టిఫైడ్ కాలీజీలు, స్కూళ్ళు సుమారు 250  సంస్థ ఓటీపీ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) ల గుర్తింపులను ఇప్పటికే అధికారులు నిరాకరిస్తుండటం  గమనార్హం.

అమెరికా ఆధారిత కన్సల్టెన్సీ గురుకుల్ ఓవర్ సీస్  సీఈవో విష్ణు వర్ధన్ రెడ్డి  ఈ వివరాలను అందించారు.  ఈ నిర్ణయంతో ఆయా సంస్థల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందన్నారు. వీరికి డిసెంబరు 12 నుంచి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పొడిగింపును నిరాకరిస్తున్నారు.  తమ సంస్థలు అక్రి డిటేషన్ సౌకర్యాన్ని కోల్పోవడంతో ఈ విద్యార్థులు ఇతర కాలేజీలకు షిఫ్ట్ కావలసిన అవసరం ఏర్పడిందని తెలిపారు. భవిష్యత్తులో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పొడిగింపు  అవకాశం కోల్పోతారన్నారు.  కాగా ఎఫ్-1 వీసా హోల్డర్ల పొడిగింపు దరఖాస్తులను ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ అధికారులు అప్పుడే తిరస్కరించడం ప్రారంభించినట్టు తెలిపారు.  దీని కోసం దరఖాస్తు చేసుకునే సంస్థలకు కూడా ముప్పు కలుగుతోందని పేర్కొన్నారు.

మరోవైపు 18 నెలల తాత్కాలిక సర్టిఫికేషన్ కాలంలో ఈ సంస్థలు  అమెరికాలో గుర్తింపు పొందిన  ఏజెన్సీ నుంచి  అక్రిడిటేషన్ పొందాలి.  కానీ మౌలిక సదుపాయాలు, బోధనా సిబ్బందికొరత,ఇతర నిబంధనల కారణంగా ఆయా సంస్థలకు ఈ అనుమతి దొరకడం చాలా కష్టంగా ఉంటుందోని నిపుణులు  చెబుతున్నారు. దీనిపై అక్రిడిటేషన్ ఏజెన్సీ ఏసీఐసీఎస్ స్పందించింది. ఇప్పటికే  న్యాయపోరాటాన్ని ప్రారంభించిందని  వైజాగ్ కు చెందిన  కన్సల్టెన్సీ  ప్రతినిధి  ఆగంటి చంద్రశేఖర్  తెలిపారు. తమకు ఇంకా 18 నెలల సమయం ఉందని, ఈ లోపు అన్ని కాలేజీలు  సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని  ఆశిస్తున్నా మన్నారు. ఇది దాదాపు 250 ఇన్సిస్టిట్యూట్స్ లో చదువుతున్న  భారతీయ విద్యార్థులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల నిమిత్తం  ముందస్తు హెచ్చరిక లాంటిదని అభిప్రాయపడ్డారు. 

మరిన్ని వార్తలు