15 ఏళ్లుగా విమానంలో ఒంటరిగా..

9 Apr, 2017 17:07 IST|Sakshi

పోర్ట్‌లాండ్‌: విమానయానం విపరీతంగా వృద్ధిచెందుతోన్న ప్రస్తుత దశలో ఏటా కనీసం 500 పాత విమానాలను తుక్కు(స్క్రాప్‌)గా మార్చేస్తున్నారు. అమెరికాకు చెందిన ఇంజనీరింగ్‌ నిపుణుడు బ్రూస్‌ క్యాంప్‌బెల్‌కు ఇది ఏమాత్రం మింగుడుపడని అంశం. అందుకే ఎక్కడ పాడుబడ్డ విమానాల్ని అమ్మేస్తున్నారని తెలిస్తే అక్కడికెళ్లి కొనేస్తాడు! అన్నీ కొనడం కుదరదుకాబట్టి ఇష్టమైనవాటిని కనుక్కుంటాడు. అలా తన 20వ ఏట కొనుగోలుచేసిన భారీ బోయింగ్‌ 727 విమానాన్ని తన ఆవాసంగా మార్చుకున్నాడు క్యాంప్‌బెల్‌!

ఆరెగాన్‌(యూఎస్‌)లోని పోర్ట్‌లాండ్‌కు చెందిన బ్రూస్‌.. తన వ్యవసాయ క్షేత్రంలో ఈ విమానం ఇంటిని రూపొందించాడు. పచ్చటి ప్రకృతి నడుమ, చిక్కటి చెట్ల మధ్య కొలువైన ఈ ఫైట్‌ హౌస్‌లోనే గడిచిన 15 ఏళ్లుగా బ్రూస్‌ నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం అతని వయసు 66 ఏళ్లు. సంవత్సరంలో ఆరు నెలలు ఫ్లైట్‌ హౌస్‌లో ఉండే బ్రూస్‌.. మిగిలిన కాలమంతా పాత విమానాల కోసం విదేశాల్లో సంచరిస్తూఉంటాడు. ఆలూ, చూలు లేరు కాబట్టి అతనలా ప్రశాంతంగా, తనకు నచ్చినట్లు జీవిస్తున్నాడు..

 

 

మరిన్ని వార్తలు