ఎలక్షన్ డేపై అమెరికా ఆందోళన

4 Nov, 2016 13:53 IST|Sakshi
జాక్సన్విల్లే : రష్యా సైబర్ దాడులతో ఇప్పటికే వణికిపోతున్న అమెరికా, వచ్చే వారంలో జరుగబోయే ఎన్నికల రోజు మరోసారి ఆ దేశం సైబర్ ఎటాక్స్ చేస్తుందోమోనని భయపడుతోంది. అమెరికా సెక్యురిటీ, ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు ఈ భయాందోళలను వ్యక్తపరుస్తున్నాయి.  ఈ విషయంపై ఇప్పటికే వివిధ మీడియా సంస్థలు అమెరికాను హెచ్చరించాయి. ఈ ఎటాక్స్ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపనప్పటికీ, రిజల్ట్స్ చట్టబద్ధతపై సందేహం వ్యక్తమయ్యే అవకాశముందుని రిపోర్టులు పేర్కొంటున్నాయి.  రష్యా సైబర్ ఎటాక్స్ అంచనాలు అమెరికా గూఢచార్య ఏజెన్సీలలో మరింత భయాందోళనలను నెలకొల్పుతున్నాయి. దాడులు జరిగితే అవి రాజకీయ సంక్షోభానికి దారితీస్తాయని వాషింగ్టన్ పోస్టు తెలిపింది. అయితే అమెరికా ఎన్నికల ఫలితాలనేమీ రష్యా ఖరారు చేయదని హోస్ ఇంటెలిజెన్స్ కమిటీలో టాప్ డెమోక్రాట్ అడమ్ బి స్కిఫ్ మండిపడుతున్నారు.
 
రష్యన్ లేదా ఇతర వ్యక్తులు మంగళవారం జరుగబోయే అధ్యక్ష ఎన్నికలను అణగదొక్కాలని చూస్తున్నారని, ఈ క్రమంలోనే వారు హ్యాకింగ్కు ప్లాన్ చేస్తున్నారని ప్రభుత్వ అధికారులు సైతం అనుమానిస్తున్నట్టు ఎన్బీసీ న్యూస్ రిపోర్టు చేసింది.  అసలైన ఓటింగ్లో లేదా ఓట్ కౌంటింగ్లో ఏమైనా తప్పుదోవలు జరిగినట్టు తెలిస్తే, అది సీరియస్ ఉల్లంఘనగా పరిగణిస్తామని ముందుగానే రష్యాకు వార్నింగ్లు వెళ్లాయి. ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కేవలం టెక్నికల్గానే కాక, మెసేజింగ్ వంటి పలువిషయాల్లో ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో సైబర్ దాడులకు అవకాశం ఇవ్వమని అధికారులు పేర్కొంటున్నారు. స్టేట్స్లో ఓటింగ్ మిషన్లకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంచడం లేదని, వివిధ స్థాయిల్లో విస్తృతమైన పర్యవేక్షణను ఉంచుతామని అధికారులు చెబుతున్నారు.  
మరిన్ని వార్తలు