ట్రంప్ ఇంకా అప్డేట్ కాలేదట!

27 Jan, 2017 19:05 IST|Sakshi
ట్రంప్ ఇంకా అప్డేట్ కాలేదట!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించి వైట్‌హౌస్‌కు వెళ్లినప్పటికీ, ఇంకా దాని టెక్నాలజీ పద్ధతులకు అప్డేట్ కాలేదట. ట్విట్టర్‌పై పోస్టు చేయడానికి ప్రెసిడెంట్ ఇంకా తన పాత ఆండ్రాయిడ్ డివైజ్‌నే వాడుతున్నారని రిపోర్టులు చెబుతున్నాయి. న్యూయార్క్ టైమ్స్ రిపోర్టు ప్రకారం గతవారం చివర్లో వాషింగ్టన్కు వెళ్లిన ట్రంప్, అప్పటినుంచి ట్విట్టర్‌పై పోస్టు చేయడానికి ఎలాంటి భద్రత లేని తన ఆండ్రాయిడ్ ఫోన్ నే వాడుతున్నారని తెలిపింది. ఎలాంటి భద్రతలేని డివైజ్‌ను ట్రంప్ వాడటం, అటు ఆయనకు, ఇటు దేశానికి అంతమంచింది కాదని, సెక్యురిటీ సమస్యలు వస్తాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అయితే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే పాత ఫోన్ పక్కనపడేసి, కొత్త ఐఫోన్ వాడనున్నారని అమెరికా నిఘా విభాగం తెలిపిన సంగతి తెలిసిందే.
 
పాత నంబర్ ఉన్నా, ఫోన్ ఉన్నా ఏదో రకంగా హ్యాకింగ్ చేసి సైబర్ నేరగాళ్లు సమాచారం చోరీ చేస్తారని నిఘా విభాగం చెప్పింది. కానీ ట్రంప్ ఇంకా తన ట్విట్టర్ పోస్టులకు పాత ఆండ్రాయిడ్ ఫోన్‌నే వాడుతున్నారని తెలిసింది. కనీసం ట్రంప్ జాతి భద్రతను, విదేశీ నేరగాళ్లను దృష్టిలో పెట్టుకుని సెక్యుర్ డివైజ్‌ను వాడాలని డెమొక్రాటిక్కు చెందిన ఓ సెనెటర్ చెప్పారు. అమెరికా అధ్యక్షుడిగా ఒబామా ఉన్న సమయంలో మాడిఫైడ్ బ్లాక్ బెర్రీ ఫోన్ వాడారు. ఆ తర్వాత ఐఫోన్ సర్వీసును ఆయనకు అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం ట్రంప్ కూడా ఇదే పద్ధతిని కొనసాగించాలని సెనెటర్ సూచించారు. 
 
Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా