బాలికపై అత్యాచారం.. ప్రత్యక్ష ప్రసారం!

14 Apr, 2016 14:40 IST|Sakshi
బాలికపై అత్యాచారం.. ప్రత్యక్ష ప్రసారం!

తన బోయ్‌ఫ్రెండు ఓ బాలికపై అత్యాచారం చేస్తుంటే.. దాన్ని పెరిస్కోప్ అనే యాప్ ద్వారా లైవ్‌లో ప్రపంచం మొత్తానికి చూపించిందో అమ్మాయి. మారినా అలెక్సీవ్నా లోనినా అనే అమ్మాయి, ఆమె 17 ఏళ్ల స్నేహితురాలు కలిసి రేమండ్ బోయ్డ్ గేట్స్ (29) అనే వ్యక్తితో కూర్చుని మద్యం తాగుతున్నారని, ఆ మత్తులోనే అతడు 17 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. ఆ లైంగిక దాడి మొత్తాన్ని పెరిస్కోప్ యాప్ ద్వారా లోనినా లైవ్ స్ట్రీమింగ్‌లో ప్రసారం చేసింది. ఈ యాప్‌ను తమ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్నవాళ్లు ఎవరైనా ఆ సమయంలో ఆ వీడియో చూడొచ్చన్నమాట.

దాంతోపాటు అత్యాచారం జరగడానికి ముందురోజు రాత్రి బాధితురాలి నగ్న ఫొటోలను కూడా ఆమె తీసినట్లు ఆరోపణలున్నాయి. లోనినా స్నేహితులలో ఒకరు పెరిస్కోప్‌లో ఆ లైవ్ వీడియో చూసి, పోలీసులకు ఫిర్యాదుచేయడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. దాంతో లోనినా, గేట్స్ ఇద్దరి మీద ఒక కౌంట్ కిడ్నాప్, రెండు కౌంట్ల అత్యాచారం తదితర నేరాల కింద కేసులు పెట్టారు. నేరం రుజువైతే వారిద్దరికీ 40 ఏళ్ల వరకు జైలుశిక్ష పడుతుంది.

మరిన్ని వార్తలు