మోదీ పాలనలో సబ్‌కా సర్వనాశ్‌

1 Jul, 2017 02:36 IST|Sakshi
మోదీ పాలనలో సబ్‌కా సర్వనాశ్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని మోదీ నిర్ణయాలతో సబ్‌కా వికాస్‌ కాద ని, సబ్‌కా సర్వనాశ్‌ అయ్యే ప్రమాదముందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలోని వివిధ రిటైల్, హోల్‌ సేల్‌ క్లాత్‌ మర్చంట్‌ అసోసియేషన్ల ప్రతినిధులు గాంధీభవన్‌లో ఉత్తమ్‌కుమార్‌ను శుక్రవారం కలిశారు. జీఎస్టీ వల్ల తమపై పడేభారం, తలెత్తనున్న ఇబ్బం దులను వివరించారు.

అనంతరం ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడుతూ.. జీఎస్టీతో బట్టల వ్యా పార రంగం తీవ్రంగా దెబ్బతింటుందని, లక్షలాది కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదముందని హెచ్చరించారు. బట్టల వ్యాపారాన్ని జీఎస్టీ నుంచి మినహాయించా లన్నారు. ఈ విషయాన్ని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో మాట్లాడతానని,  చిన్నచిన్న బట్టల వ్యాపార రంగాన్ని జీఎస్టీ నుంచి మినహాయించే విధంగా పార్లమెంటులో ప్రస్తావించేలా ప్రయత్నిస్తానని ఆయన వెల్లడించారు.  
 

>
మరిన్ని వార్తలు