యూపీ బీజేపీదే.. 222 సీట్లు ఖాయం!

10 Mar, 2017 19:03 IST|Sakshi
యూపీ బీజేపీదే.. 222 సీట్లు ఖాయం!

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనాలిసిస్ లో వెల్లడించింది. కాషాయ దళం 220 నుంచి 222 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 35 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. ఇంటర్నెట్ డేటా ట్రెండ్ ను విశ్లేషించడం ద్వారా ఈ అంచనాకు వచ్చింది. మొగియా అనే సంస్థ ఈ అధ్యయనం నిర్వహించింది.

ఇంటర్నెట్ లో 17 లక్షల యాక్టివ్ ఐడెంటిటీస్ ద్వారా కోటీ 16 లక్షల మంది(దాదాపు 18 శాతం మంది ఓటర్ల) అభిప్రాయాల ఆధారంగా ఈ సర్వే జరిపింది. ఇంటర్నెట్ లో అందరి కంటే ప్రధాని నరేంద్ర మోదీ ముందు ఉండడం బీజేపీకి అదనపు సానుకూలాంశంగా మారిందని మొగియా వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ వైపు మొగ్గు చూపడం కాంగ్రెస్-ఎస్పీ కూటమికి ప్రతికూలాంశంగా మారిందని వివరించింది. రాహుల్ గాంధీ కంటే ప్రియాంక గాంధీపై ఆసక్తి చూపే ఓటర్ల సంఖ్య దాదాపు రెండింతలు పెరిగిందని విశ్లేషించింది.

సంజీవ్ రాయ్ నేతృత్వంలోని మొగియా వేసిన అంచనాలన్నీ ఇప్పటివరకు నిజమయ్యాయి. అమెరికా డొనాల్డ్ ట్రంప్, మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందన్న అంచనాలు లెక్క తప్పలేదు. ఈ నేపథ్యంలో యూపీ ఎన్నికలపై మొగియా ముందుస్తు అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మరిన్ని వార్తలు